White Challenge : పచ్చని తెలంగాణపై మచ్చ తేవడమే రేవంత్ ఎజెండా.. ఆందోల్ ఎంఎల్ఏ క్రాంతి కిరణ్ (వీడియో)

By AN TeluguFirst Published Sep 21, 2021, 3:46 PM IST
Highlights

డ్రగ్స్ సరఫరాలో డ్రగ్స్ వాడకంలో దేశంలో మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో పంజాబ్ ఉండగా.. డ్రగ్స్ కు అడ్డ తెలంగాణ అని రేవంత్ రెడ్డి అండ్ కో ప్రచారం చేయడం వెనక వేరే ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

హైదరాబాద్ : వైట్ ఛాలెంజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ విలువలను దిగజార్చుతున్నదంటూ ఆందోల్ ఎంఎల్ఏ క్రాంతి కిరణ్ మండిపడ్డారు. తెలంగాణ లో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేయడం, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటిఆర్ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు  చేయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్ర అని ఎంఎల్ఏ క్రాంతి కిరణ్ అన్నారు. 

"

డ్రగ్స్ సరఫరాలో డ్రగ్స్ వాడకంలో దేశంలో మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో పంజాబ్ ఉండగా.. డ్రగ్స్ కు అడ్డ తెలంగాణ అని రేవంత్ రెడ్డి అండ్ కో ప్రచారం చేయడం వెనక వేరే ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో దాదాపు 80వేల మంది డ్రగ్స్ కి బానిసలు అయి ఆ రాష్ట్రం విలవిల్లాడుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతుంటే కాంగ్రెస్ పాలిత ర్రాష్టాన్ని వెనకేసుకొస్తు తెలంగాణను ఎందుకు బద్నాం చేస్తున్నారో రేవంత్ అండ్ కో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

డ్రగ్స్ రహిత సమాజం రావాలని తెలంగాణే కాదు యావత్తు భారతదేశం డ్రగ్స్ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నానన్నారు. అందుకు గాను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ నుండి ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నుండి వైట్ ఛాలెంజ్ మొదలుపెట్టాలని ఆయన రాహుల్ గాంధీ ని ఛాలెంజ్ చేశారు. అన్ని రంగాల్లో దేశంలో అత్యంత ప్రతిభను కనబరుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయని.. తెలంగాణలో ప్రగతిని చూసి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలే ఆశ్చర్యపోతున్నాయి.. దీన్ని జీర్ణించుకోలేని రేవంత్ అండ్ కో తప్పుడు ప్రచారానికి దిగారని అన్నారు. 

రోజూ టివీల్లో కనపడాలంటే ఏదో  సెన్సేషనల్ పదం వాడి వార్తల్లో నిలవాలి అనే ఒక నీచమైన సంస్కృతీ ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మీద బురదజల్లడమే ధ్యేయంగా కనిపిస్తుందని నిజంగా నిజాయితీ ఉంటే, దేశం డ్రగ్స్ రహితంగా మారాలంటే, జాతీయ స్థాయిలో ఒక కదలిక రావాలంటే, జాతీయ పార్టీతోనే సాధ్యం అని మీరు భావిస్తున్నందున రాహుల్ గాంధీ తోనే మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

click me!