ప్రేమజంటలపై దాడి, రేప్: ఆర్మీ జవాన్‌‌ను ఎలా అరెస్ట్ చేశారంటే?

First Published Jul 25, 2018, 6:17 PM IST
Highlights

శాస్త్రీయమైన ఆధారాల సహాయంతోనే ఆర్మీ జవాన్‌ బ్రిజేష్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్యటు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. నిందితుడిని  తమ సిబ్బంది అత్యంత ధైర్య సాహాసాలతో పట్టుకొన్నారని ఆయన చెప్పారు. 

హైదరాబాద్: శాస్త్రీయమైన ఆధారాల సహాయంతోనే ఆర్మీ జవాన్‌ బ్రిజేష్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్యటు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. నిందితుడిని  తమ సిబ్బంది అత్యంత ధైర్య సాహాసాలతో పట్టుకొన్నారని ఆయన చెప్పారు. సంఘటనా స్థలంలోనే  నిందితుడిని అరెస్టు చేశారని  అంజనీ‌కుమార్  చెప్పారు.

సికింద్రాబాద్‌ తిరుమలగిరి ప్రాంతంలో  మంగళవారం నాడు  ఓ ప్రేమ జంట ఏకాంతంగా ఉన్న విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్  ప్రియుడిని తీవ్రంగా గాయపర్చాడని చెప్పారు. 

ఆ తర్వాత అతడి ముందే ప్రియురాలిపై అత్యాచారానికి ప్రయత్నించినట్టు చెప్పారు.  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని తమ సిబ్బంది  వెంటాడి పట్టుకొన్నారని  చెప్పారు.

గతంలో కూడ ఇదే ప్రాంతంలో ఇదే తరహ ఘటనలు చోటు చేసుకొన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు నల్ల రంగం ట్రౌజర్ వేసుకొన్నారని చెప్పారు. అంతేకాదు బాధితులపై మెడపై తీవ్రంగా గాయపర్చి తనకు సహకరించేలా చేసుకొంటాడని గుర్తించారు. నిందితుడు ఉపయోగించిన మోటార్‌బైక్‌పై  ఆర్మీ అని రాసి ఉన్నట్టు బాధితులు ఇచ్చిన సమాచారం  కూడ సరిపోయిందన్నారు.

గతంలో బాధితులపై అత్యాచారం చేసిన సందర్భంగా దొరికిన వీర్యం నమూనాలతో నిందితుడి వీర్యం నమూనాలు కూడ సరిపోయాయని చెప్పారు. అయితే నిందితుడికి కఠినంగా శిక్ష పడేందుకు గాను  తాము  శాస్త్రీయంగా అన్ని రకాల ఆధారాలను సేకరించినట్టు ఆయన తెలిపారు.

కొంతకాలంగా ఈ ప్రాంతంలో అత్యాచారాలు చోటు చేసుకొంటున్న విషయాన్ని గుర్తించి ఈ ప్రాంతంలో  నిఘాను పెంచినట్టు ఆయన చెప్పారు. అయితే మంగళవారం నాడు  ప్రేమ జంటపై దాడి చేసి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తమకు సమాచారమివ్వడంతో  బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని కనుగొని నిందితుడిని పట్టుకొన్నట్టు అంజనీకుమార్ చెప్పారు. అయితే పోలీసులను చూసి నిందితుడు పారిపోతోంటే పట్టుకొన్నారని ఆయన చెప్పారు. 

click me!