ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

By pratap reddyFirst Published Oct 1, 2018, 1:30 PM IST
Highlights

తమ బంధువుల ఇళ్లలో ఐటి అధికారుల పేరుతో దాడులు చేశారని, అయితే తాము దాడులు చేయలేదని ఐటి అధికారులు చెబుతున్నారని ఉదయసింహ అన్నారు. దీంతో రణధీర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్: ఆదాయం పన్ను శాఖ (ఐటి) దాడులపై ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయసింహ సంచలన ప్రకటన చేశారు. సోమవారంనాడు ఆయన ఆయకార్ భవన్ లో ఐటి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఐటి దాడులపై ప్రకటన చేశారు 

తమ బంధువుల ఇళ్లలో ఐటి అధికారుల పేరుతో దాడులు చేశారని, అయితే తాము దాడులు చేయలేదని ఐటి అధికారులు చెబుతున్నారని ఉదయసింహ అన్నారు. దీంతో రణధీర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఐటి అధికారుల పేరుతో తమ బంధువుల ఇళ్లను లూటీ చేశారని, 15 మంది ఇందులో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ దాడులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ఆయన అడిగారు. 

ఐదు సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లారని ఉదయసింహ చెప్పారు. తనకు విషయం చెప్పారని అన్నారు. తాను ఐటి అధికారులను అడిగానని అన్నారు. ఆదివారంనాడు తాము సోదాలు చేయబోమని, తాము సోదాలే చేయలేదని ఐటి అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. 

రేవంత్ రెడ్డి సన్నిహితుడిని తానని, తనకు సన్నిహితుడు రణధీర్ రెడ్డి అని, ఒక సామాజిక వర్గానికి చెందినవారిపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. దాడి చేసినవారు పోలీసులు, ప్రభుత్వాధికారులేనని ఆయన అన్నారు. సిఐ ఫిర్యాదు తీసుకోకుండా తాను తీసుకోవడానికి వీలు లేదని చెబుతున్నారని, దాంతో పోలీసులకు తెలిసే దాడులు జరిగాయని ఆయన అన్నారు. 

విచారణ కోసం తనకు మరింత సమయం కావాలని తాను ఐటి అధికారులను కోరినట్లు ఉదయసింహ చెప్పారు. తిరిగి మరోసారి రావాలని వారు సూచించినట్లు ఆయన తెలిపారు. తాను తిరిగి 3వ తేదీన ఐటి అధికారుల ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. 

ఈ నెల 3వ తేదీన కాంగ్రెసు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజా విచారణల నేపథ్యంలో ఓటుకు నోటు కేసును తిరిగి తోడుతున్నారని అభిప్రాయం బలపడుతోంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

click me!