టికెట్ విత్ డ్రా చేయాలి...ఉత్తమ్‌ భార్య పద్మావతిపై కవిత వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Nov 16, 2018, 1:08 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కవిత. నిజామాబాద్‌‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ... టీఆర్ఎస్‌ను ఉత్తమ్ ఫ్యామిలీ పార్టీ అన్నారని.. మరి అలాంటప్పుడు తన భార్య పద్మావతికి టికెట్ ఎలా తీసుకుంటారని కవిత ప్రశ్నించారు.

తన భార్య టికెట్‌ను ఉపసంహరించుకుంటే ఉత్తమ్‌కు గౌరవం దక్కుతుందని ఆమె సూచించారు. కోదాడలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీ. కాంగ్రెస్ నేతలకు ఒక్కసారిగా సెటిలర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందని.. కొత్తగా కుసుమ కుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు.

కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని రేణుకా చౌదరి రాజీనామా చేస్తానన్నారని ఆమె గుర్తు చేశారు.. తెలంగాణలో టీడీపీ అభ్యర్థులను కాదన.. ఆసలు ఆ పార్టీనే జనం తిరస్కరిస్తారని కవిత అన్నారు..

రూరల్, అర్బన్ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని.. 100 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. నిజామాబాద్‌లో 9 సీట్లు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తామని.. జగిత్యాలలో గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామని కవిత అన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థి కోసం.. స్వయంగా కారు నడిపిన కవిత

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

ట్రైలర్ మాత్రమే చూపించాం,త్వరలో త్రీడీ సినిమా చూపిస్తాం: ఎంపీ కవిత

తెలంగాణ శశికళ కవిత, కేటీఆర్ ఓ బెప్పం, లాగులు తడుస్తాయ్: మధుయాష్కీ

ఉత్తమ్‌కి జబ్బుచేసింది... ఇంజక్షన్ ఇచ్చి రక్తం ఎక్కించండి : కవిత

ఎందుకో తెలీదు...కేటీఆర్, కవితలకు అడ్డుగా ఉన్నాననే....: విజయశాంతి

రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్: ఎంపీ కవిత

click me!