టీఆర్ఎస్‌లోకి సండ్ర: పిడమర్తి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Dec 23, 2018, 12:27 PM IST
Highlights

ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు టీఆర్ఎస్ నాయకులతో టచ్ లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరి చేరికను సత్తుపల్లి టీఆర్ఎస్ ఇంచార్జి, ఇటీవల సండ్ర చేతిలో ఓటమిపాలైన పిడమర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సత్తుపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ సండ్రపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు ప్రగతిభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే ఆయన బూట్లు నాకేందుకు కూడా సిద్దంగా వున్నారంటూ పిడమర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  

ఎన్నికల సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపి పొంగులేటిలను కూడా ఆ నాయకులు తీవ్రంగా దూషించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు వారిచెంతకే చేరి పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయాలను అపహాస్యం చేసే ఇలాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని...అటువంటి రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిడమర్తి రవి కార్యకర్తలకు సూచించారు. 

సంబంధిత వార్తలు

రంగంలోకి కేసీఆర్: టీఆర్ఎస్‌లోకి సండ్ర?, ముహుర్తమిదే

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

click me!