కేసీఆర్ పీఎం...కేటీఆర్ సీఎం కావడం ఖాయం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Dec 23, 2018, 11:52 AM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు దేశమంతా అమలు కావాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రవేశించాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి అన్నీ కలిసివస్తే ప్రధాన మంత్రి అవడం ఖాయమని జోస్యం చెప్పారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల్లోకి వచ్చి ఆయన సీఎం అవుతారన్నారు. తాను అదే జరగాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించాడు. 

మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రశంసించారు. 

తెలంగాణలో మరో ఇరవై ఏళ్లు ఇదే విధంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని అన్నారు. కానీ భవిష్యత్ లో యువనేత కేటీఆర్ రాష్ట్ర పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అయితే ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ ను వరిస్తుందని...ఆయన అన్నివిధాలా దానికి అర్హుడని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 
 
click me!