డ్రగ్స్ కేసులో రకుల్, రానాల‌ వెనుక ‘‘ సీక్రెట్ ’’ మిత్రుడెవరు: కేటీఆర్‌ టార్గెట్‌గా రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 18, 2021, 6:36 PM IST
Highlights

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు రేవంత్.

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు రేవంత్. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్నా వారు ఎవరి దోస్తులంటూ ఆయన ప్రశ్నించారు. కాగా, రేవంత్  రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తనకు డ్రగ్స్ కేసులో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తాను డ్రగ్స్ అనాలిసిస్ టెస్టులకు సిద్ధమని .. రాహుల్ గాంధీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో తప్పుదారి పట్టిస్తే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. మీడియాతో చాట్ చాట్‌లో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్.

ఆ వెంటనే శనివారం సాయంత్రం స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వైట్ ఛాలెంజ్‌కు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని లాగారు. డ్రగ్స్ మహమ్మారి బారినపడిన యువతను కాపాడాల్సిన బాధ్యత మనపై వుందని ఆయన చెప్పారు. యువత పెడదారిన పడకుండా ఆదర్శవంతంగా రాజకీయాలకు, విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు రావాల్సిందిగా రేవంత్ కోరారు. ఈడీ సమాచారం అడిగితే ఇచ్చేది లేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెప్పిందని... అలాగే ఈడీ విచారణ రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ALso Read:ఎవడో పిచ్చోడు ఈడీకి లేఖ రాశాడు: డ్రగ్స్ ఇష్యూపై కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తామంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ విచారణకు పిలిచినప్పుడు రానా, రకుల్ ప్రీత్ సింగ్ లేరని.. కానీ ఈడీ మాత్రం రానా, రకుల్ ప్రీత్ సింగ్‌లను పిలిచిందని రేవంత్ స్పష్టం చేశారు. వీరిద్దరిని కాపాడింది ఎవరని .. ఆ సీక్రెట్ మిత్రుడు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. 2017లో డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బట్టే ఈడీ విచారణ జరిపిందని  రేవంత్ తెలిపారు.

బెంగళూరు, హైదరాబాద్‌లలో బయటపడిన డ్రగ్స్ దందాలకు టీఆర్ఎస్ పెద్దలకు సంబంధాలు వున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేయడానికి కేటీఆర్‌కి ఉన్న అభ్యంతరం ఏంటనీ రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వ సంస్థల విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. వయసును బట్టి కాదని.. చేసే పనిని బట్టి గౌరవం ఇస్తామని రేవంత్ చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా వున్నప్పుడు... ఆమెతో సమావేశం తర్వాత బయటకొచ్చి అక్కడ ఆయనకంటే వయసులో పెద్ద అయిన పోలీస్ అధికారులతో కేటీఆర్ వాడిన భాష గురించిన వీడియో ఫుటేజ్‌లు తమ దగ్గర వున్నాయన్నారు. 

click me!