టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల పాటు రవితేజను విచారించిన ఈడీ

By narsimha lodeFirst Published Sep 9, 2021, 4:17 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ‌తో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ను కూడ ఈడీ అధికారులు గురువారంనాడు విచారించారు. ఐదు గంటల పాటు రవితేజని ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2015 నుండి బ్యాంకు ఖాతా వివరాలను కూడ రవితేజ ఈడీకి అందించారు.

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  సినీ నటుడు రవితేజను ఐదు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. గురువారం నాడు ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. సాయంత్రం  నాలుగు గంటలకు  ఆయన విచారణ పూర్తైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రవితేజ విచారణ ప్రారంభమైంది.సినీ నటుడు రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్  ను కూడ ఈడీ అధికారులు ప్రశ్నించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కీలకంగా ఉన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 2017లో  రవితేజ డ్రైవర్  శ్రీనివాస్  తొలుత ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కెల్విన్ పాత్రను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

ఇవాళ విచారణకు హాజరైన సమయంలో 2015 నుండి బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ ను  ఈడీ అధికారులకు రవితేజ అందించారు. మరోవైపు ఇవాళ రవితేజ విచారణ సమయంలో కెల్విన్ స్నేహితుడు జిషాన్ ను ఈడీ అధికారులు రప్పించారు. రవితేజ, శ్రీనివాస్ లను విడివిడగా విచారించారు.  ఆ తర్వాత జీషాన్ సమక్షంలో విచారించినట్టుగా తెలుస్తోంది.

రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ బ్యాంకు ఖాతా నుండి పెద్ద ఎత్తున నిధులు ఇతరుల ఖాతాల్లోకి వెళ్లిన విషయాన్ని ఈడీ గుర్తించింది.ఈ నిధులను ఎందుకు మళ్లించారనే విషయమై ఈడీ ప్రశ్నించింది.  మరోవైపు జీషాన్ ఇంకా ఈడీ అధికారుల వద్దే ఉన్నాడు.

 


 

click me!