మహా కూటమి యత్నాలు: కోదండరామ్ షరతులివే

By narsimha lodeFirst Published Sep 10, 2018, 4:09 PM IST
Highlights

తెలంగాణలో  టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు దిశగా  విపక్షలు  కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ మహా కూటమిని ఏర్పాటుకు వివిధ పార్టీలతో చర్చిస్తున్నారు


హైదరాబాద్: తెలంగాణలో  టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు దిశగా  విపక్షలు  కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ మహా కూటమిని ఏర్పాటుకు వివిధ పార్టీలతో చర్చిస్తున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో కూడ  రమణ సోమవారం నాడు చర్చించనున్నారు.

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌యేతర పార్టీలతో చర్చిస్తున్నారు.  ఇందులో భాగంగానే సీపీఐ నేతలతో సెప్టెంబర్ 9వ తేదీన ఎల్. రమణ చర్చించారు.  మహా కూటమిలో చేరేందుకు సీపీఐ సానుకూలంగా స్పందించింది.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి కూడ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో ఆదివారం నాడు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడ  ఈ కూటమితో పొత్తుకు సానుకూలంగానే స్పందించింది.

ఆదివారం నాడే టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌తో ఎల్. రమణ ఫోన్ చేశారు. సోమవారం నానాడు వీరిద్దరూ కూడ సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే కూటమిలో చేరడానికి టీజేఎస్ కొన్ని షరతులను  పెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ కూటమిలో చేరితే తమకు కనీసంగా 30 సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే  పొత్తుల విషయంలో పార్టీల మధ్య పట్టు విడుపులు ఉండాల్సిన అవసరం ఉందని ఎల్. రమణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో సమావేశమైన సందర్భంగానే ప్రకటించారు.

అయితే విపక్షాల ఉమ్మడి లక్ష్యం కేసీఆర్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే.. అయితే 30 సీట్లు టీజేఎస్ డిమాండ్ చేస్తే.. ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చేందుకు  కూటమి అంగీకరంచే అవకాశం ఉందనేది  ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

కోదండరామ్ తో  ఎల్.రమణ సమావేశమైతే  ఈ విషయమై కొంత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.  అయితే  టీజేఎస్ ను డిమాండ్ చేయాలని భావిస్తున్నట్టుగా 30 సీట్లు ఆ పార్టీకి ఇచ్చే అవకాశం ఉండదని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలు చదవండి

సిపిఐ, టీడీపి మధ్య పొత్తు ఖరారు: కాంగ్రెసుతోనూ మాట్లాడ్తామని రమణ ప్రకటన

కాంగ్రెస్‌కు షాక్: మహాకూటమికి టీడీపీ కసరత్తు, చాడకు ఎల్. రమణ ఫోన్

సీపీఐ, టీజేఎస్‌లకు టీడీపీ ఓకే: కాంగ్రెస్‌తో పొత్తుపై ఉత్కంఠ

40 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లపై గురి, కాంగ్రెస్ తొ పొత్తుపై టీడీపీ సస్పెన్స్

click me!