టికెట్లు అమ్ముకుంటున్నారు: కోదండరామ్ పార్టీపై జ్యోత్స్న ఆరోపణ

By pratap reddyFirst Published Sep 10, 2018, 3:25 PM IST
Highlights

ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)పై అప్పుడే ఆరోపణలు మొలయ్యాయి. టిజెఎస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని పార్టీకి రాజీనామా చేసిన ప్రొఫెసర్ జ్యోత్స్న ఆరోపించారు. టీజేఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. 

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)పై అప్పుడే ఆరోపణలు మొలయ్యాయి. టిజెఎస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని పార్టీకి రాజీనామా చేసిన ప్రొఫెసర్ జ్యోత్స్న ఆరోపించారు. టీజేఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. 

టీజేఎస్‌లో మహిళలకు ప్రాధాన్యత లేదని ఆమె సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. టీజేఎస్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారని, వసూళ్లకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆమె అన్నారు. 

టిజెఎస్ నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ టికెట్లు అమ్ముకుంటున్నారని, తాను చేసే ప్రతీ ఆరోపణకు రుజువులు చూపిస్తానని ఆమె అన్నారు. టీజేఎస్ కన్వీనర్ సత్యంగౌడ్ తన గురించి అసభ్యకంగా మాట్లాడుతుని ఆమె విమర్శించారు. టీజేఎస్ ఒక వ్యాపార సంస్థగా మారిందని, టీజేఎస్‌లో వసూళ్లపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు. 

పార్టీ ఫండ్ కింద ఎన్ని కోట్లు వసూలు చేశాడో దిలీప్‌కుమార్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీజేఎస్ సిద్ధాంతాలను పక్కన పెట్టిందని, టికెట్లు అమ్ముకునే పార్టీగా టీజేఎస్ తయారైందని అన్నారు.

 అయితే, ఆమె చేసిన ఆరోపణలను దిలీప్ ఖండించారు. లక్ష రూపాయలు తమకు విరాళంగా వచ్చాయని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన ఖాతా వివరాలను కూడా ఆయన అందించారు. 

click me!