తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఇంతకీ ఈ ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదివారం TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 2 నుండి 4 వరకు జరిగాయి.
* పల్లా భారత్ చంద్ర – 150.058429
* ఉడగండ్ల రామచరణ్ రెడ్డి – 148.284029
* పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ – 147.085966
* లక్ష్మీ భర్గవ్ మెండే – 146.150845
* మంత్రిరెడ్డి వెంకట గణేష్ రాయల్ – 144.053382
* సుంకర సాయి రిషాంత్ రెడ్డి – 143.723785
* రుష్మిత్ బండారి – 142.579622
* బణి బ్రత మాజీ – 141.084897
* కోఠ ధనుష్ రెడ్డి – 140.24602
* కొమ్మ శ్రీ కార్తిక్ – 138.257604
అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగం టాపర్లు:
* పెద్దక్కగారి సాకేత్ రెడ్డి – 141.688297
* సబ్బని లలిత్ వరేణ్య – 140.477712
* చాడ అక్షిత్ – 140.00081
* పెద్దింటి రాచల షైనంద్ – 138.823946
* బ్రహ్మణి రెండ్లా – 138.710191
* గుమ్మడిదల తేజస్ – 137.82964
* కోలన్ అఖిరానంద్ రెడ్డి – 137.635667
* భానుప్రకాశ్ రెడ్డి సాధు – 136.702087
* అర్జా స్యామువెల్ సాత్విక్ – 136.674587
* శేషి కిరణ్ రెడ్డి – 136.494315
* ముందుగా TG EAPCET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
* తర్వాత View Results (E, A&P)” అనే విభాగంపై క్లిక్ చేయండి
* హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి
* 'View Results' క్లిక్ చేస్తే ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు