కేవైసీ అప్‌డేట్‌తో డబ్బుల స్వాహా: 10 మంది ముఠాను అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 11, 2021, 10:10 PM IST
Highlights

కేవేసీ అప్‌డేట్ పేరుతో 10 మంది సభ్యుల ముఠాన రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో డియోగర్ జిల్లాకు చెందిన 10 మంది సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ పోలీసులు సోమవారం నాడు తెలిపారు.

హైదరాబాద్: kyc అప్‌డేట్ పేరుతో డబ్బులు కొల్లగొడుతున్న  10 మంది ముఠా సభ్యులను rachakonda police సోమవారం నాడు arrest చేశారు.jharkhand రాష్ట్రంలోని deoghar జిల్లాకు చెందిన 10 మంది  ముఠా సభ్యులు కేవైసీ అప్‌డేట్ , కస్టమర్ కేర్ సెంటర్ నెంబర్లతో పాటు, ఓటీపీ,,యూపీఐ ఫ్రాడ్ లింకుల ద్వారా ప్రజలను మోసగిస్తున్నారని  పోలీసులు గుర్తించారు.

 బ్యాంకు అధికారులమని, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్ చేయాలని నిందితులు ఫోన్లు చేసి అమాయకులను నమ్మించి డబ్బులను కొట్టేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరిట కూడా ఈ ముఠా సభ్యులు ప్రజలను మోసం చేస్తున్నారు.  ఈ విషయమై బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.

also read:‘నీకు అక్కా చెల్లెళ్లు లేరా? అమ్మాయిని వేధిస్తావా?’.. కేసు పేరుతో రూ.6.96 లక్షలకు టోకరా..

జార్ఖండ్ కు చెందిన ముఠా ఈ పనిచేస్తోందని గుర్తించిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన  అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు స్వాహా చేశారని పోలీసులు తెలిపారు.

జార్ఖండ్ నుండి అరెస్ట్ చేసిన నిందితులను హైద్రాబాద్ కు తీసుకొచ్చారు. ఈ ముఠా సభ్యులు ఎవరెవరి నుండి ఎంత కొల్లగొట్టారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గత ఏడాది నుండి దేశ వ్యాప్తంగా cyber crime పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయినా కూడ ప్రజలు ఇలాంటి  ముఠా సభ్యుల మాటలు విని డబ్బులు కోల్పోతున్నారు.


 

click me!