Huzurabad Bypoll: ఈటల జమున ఎన్నికల క్యాంపెయిన్‌.. ప్రచారంలో ఆమె ఏమన్నారంటే..?

Published : Oct 11, 2021, 08:33 PM IST
Huzurabad Bypoll: ఈటల జమున ఎన్నికల క్యాంపెయిన్‌.. ప్రచారంలో ఆమె ఏమన్నారంటే..?

సారాంశం

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఈటల రాజేందర్ భార్య జమున ప్రచారం చేశారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రచారం చేస్తూ ఎంత ప్రచారం చేసినా, చేయకున్నా ఈటల రాజేందరే గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు.  

కరీంనగర్: హుజురాబాద్‌లో ఉపఎన్నిక క్యాంపెయిన్ జోరుగా సాగుతున్నది. అటు trs, ఇటు bjpలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి etela rajender భార్య ఈటల jamuna కూడా campaignలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలోకి వెళ్లగానే ఆమెకు ఆత్మీయ స్వాగతం లభించింది. గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

ఈ ప్రచారంలో ఈటల జమున మాట్లాడారు. ఎంత మంది ప్రచారం చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా ఈటల రాజేందరే గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ ప్రజలకు ఈటల రాజేందర్ ఏం చేసిండో అర్థమైతలేదని ఇక్కడికి వచ్చిన నాయకులు అంటున్నారు. మీ ఓటు కోసం తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని జమున తెలిపారు. ధర్మాన్ని గెలిపించాలని, న్యాయం గెలువాలని అందరూ అనుకుంటున్నారని చెప్పారు.

Also Read: Huzurabad Bypoll: సిలిండర్ కు దండంపెట్టి... గుండెలు పగిలేలా కసికసిగా ఓట్లు గుద్దండి: మంత్రి హరీష్ పిలుపు

ఈటల రాజేందర్ పేరు చెబితే మీకు గౌరవం దక్కిందని, ఆయన అలా పని చేశారని ఈటల జమున తెలిపారు. శంబునిపల్లి వాళ్లు గుంటూరుకు పత్తి అమ్మడానికి పోతే.. అక్కడ ఈటల రాజేందర్ పేరు చెబితే మంచి ధర ఇవ్వడమే కాకుండా భోజన ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి మరీ పంపించారట అని అన్నారు.

ఈటల రాజేందర్ ముగ్గురు సీఎంలను గడగడలాడించిన వ్యక్తి అని, కేసీఆర్‌ను ప్రశ్నించిన వ్యక్తి అని జమున చెప్పారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని, ఇతర కులాల్లోని పేదలకూ రూ. 10 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఈ సారి ఈటల రాజేందర్‌ను పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్