అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం: ఇన్విటేషన్ ఇచ్చిన దత్తన్న కూతురు

Published : Oct 11, 2021, 08:46 PM ISTUpdated : Oct 11, 2021, 08:53 PM IST
అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం: ఇన్విటేషన్ ఇచ్చిన దత్తన్న కూతురు

సారాంశం

ఈ నెల 17న నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ప్రతి ఏటా దత్తాత్రేయ దసరా మరునాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ ను  హర్యానా గవర్నర్ bandaru dattatreya కుమార్తె శ్రీమతి బండారు vijaya laxmi సోమవారం ఆహ్వానించారు.

also read:ఖైరతాబాద్ గణేషుడు: తెలంగాణ, హర్యానా గవర్నర్ల తొలి పూజలు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 16ఏళ్లుగా  అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో  alaii balai కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.dussehra మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానిస్తారు.

కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో  కూడ  దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్నందున ప్రముఖులను దత్తాత్రేయ కూతురు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించలేదు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి.  దీంతో ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?