Telangana: పలు కేసులను ఛేదించిన 'పోలీసు డాగ్ ల‌వ్లీ' మృతి

By Mahesh RajamoniFirst Published Jan 29, 2022, 10:30 AM IST
Highlights

Telangana: తెలంగాణ పోలీసు శాఖ‌లో మెరుగైన సేవ‌లు అందించిన పోలీసు జాగిలం ల‌వ్లీ మృతి చెందింది. అనేక కేసుల‌ను ఛేదించ‌డంలో ల‌వ్లీ సేవ‌లు అందించింది. శుక్ర‌వారం నాడు వ‌న‌ప‌ర్తి పోలీసు శాఖ పోలీసు లాంఛనాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. 
 

Telangana: తెలంగాణ పోలీసు శాఖ‌లో మెరుగైన సేవ‌లు అందించిన పోలీసు జాగిలం ల‌వ్లీ (Lovely) మృతి చెందింది. వనపర్తి ( Wanaparthy) లో పోలీసు సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. అనేక కేసుల‌ను ఛేదించ‌డంలో ల‌వ్లీ సేవ‌లు అందించింది. శుక్ర‌వారం నాడు వ‌న‌ప‌ర్తి పోలీసు శాఖ పోలీసు లాంచ‌నాల ( police honours) తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. ఈ పోలీసు జాగిలం (పోలీసు డాగ్‌) 2015లో డీజీపీకి పుష్పగుచ్ఛం అందించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గత తొమ్మిది సంవ‌త్స‌రాలుగా లవ్లీ పోలీసు శాఖ‌లో సేవ‌లు అందించింది. పోలీసు బలగాలకు సేవ చేస్తూ, అనేక కేసులను ఛేదించడంతో పాటు నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయం  చేసింది. 

అనారోగ్యంతో మృతి చెందిన పోలీసు డాగ్ ల‌వ్లీకి పోలీసుల లాంఛ‌నాల ( police honours)తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. లవ్లీ మృతి పట్ల వనపర్తి  ( Wanaparthy) జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు (Wanaparthy district SP K Apoorva Rao)శుక్రవారం సంతాపం తెలిపారు. "మేము విచారంగా ఉన్నాము. అనేక క్రైమ్ కేసులను ఛేదించడంలో లవ్లీ (Lovely) మాకు సహాయం చేసింది' అని ఎస్పీ తెలిపారు. తొమ్మిదేళ్లపాటు లవ్లీ బాగోగులు చూసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా, తన జీవితకాలంలో, లవ్లీ అనేక కేసులను పరిష్కరించడంలో సహాయం చేయడమే కాకుండా దాని విశిష్ట సేవకు పతకాలను కూడా గెలుచుకుంది. పలు హత్య కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించింది. 2018లో వనపర్తి పట్టణంలో జరిగిన దోపిడీ కేసును ఛేదించడంలో లవ్లీ పాత్ర కీలక‌మైంద‌ని పోలీసులు అధికారులు (Wanaparthy district SP K Apoorva Rao) తెలిపారు. 

2013లో కుక్కల శిక్షణ (canine training) లో ప్రాథమిక కోర్సు చేస్తుండగా లవ్లీ రెండో స్థానంలో నిలిచింది. 2019లో నిర్వహించిన పోటీల్లో లవ్లీ రాష్ట్రస్థాయి బంగారు (state-level gold medal) పతకాన్ని గెలుచుకుంది. బెంగళూరులో జరిగిన 2015-16 ఆల్ ఇండియా డ్యూటీ మీట్‌లో లవ్లీ (Lovely) ఛాంపియన్‌షిప్‌ (championship) ను గెలుచుకుంది. ఈక్రమంలోనే ల‌వ్లీ సాధించిన ఘ‌న‌త‌ల‌ను దృష్టి ఉంచుకుని 2015లో డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసేందుకు పోలీసు డాగ్ ల‌వ్లీ  ఎంపికైంది. గ‌త కొంత కాలంగా ల‌వ్లీ అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. అయితే లవ్లీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి వైద్యులు జనవరి 20న హైదరాబాద్ (HYDERABAD) లోని వెటర్నరీ ఆస్పత్రికి (veterinary hospital) త‌ర‌లించారు. అక్క‌డే (HYDERABAD veterinary hospital దానికి వైద్య చికిత్స‌లు అందిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో లవ్లీ  చికిత్స అందిస్తున్న‌ప్ప‌టికీ.. దాని (Lovely)ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి మెరుగైన ఫ‌లితం కన‌బ‌డ‌లేదు. ల‌వ్లీ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుపడకపోవడంతో తిరిగి వనపర్తి  ( Wanaparthy)పశువైద్యశాలకు తరలించి చికిత్స కొనసాగించారు. అయితే శుక్రవారం ఉదయం లవ్లీ మృతి చెందింది. లవ్లీ (Lovely) అంత్యక్రియలు తిరుమలయ్య కొండల అటవీ (Tirumallayya hills forest area) ప్రాంతంలో పోలీసు లాంఛనాలతో నిర్వహించినట్లు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జగన్ ( inspector Jagan) తెలిపారు.

click me!