ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లుప్రైవేట్ కాలేజీలపై సీరియస్: సబితా ఇంద్రారెడ్డి

By narsimha lodeFirst Published Oct 21, 2021, 1:37 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.అధికారులతో ఇవాళ సబితా ఇంద్రారెడ్డి సమీక్ష చేశారు.
 

హైదరాబాద్:  ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.Inter first exams నిర్వహణ విషయమై గురువారం నాడు పలు శాఖల అధికారులతో మంత్రి Sabitha Indra Reddy సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిశా నిర్ధేశం చేశారు.

also read:తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్

గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. ఈ పరీక్షలకు 4.50 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.corona నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచామని మంత్రి తెలిపారు.25వేల మంది ఇన్విజిలేటర్ లు  విధులు నిర్వహిస్తారని మంత్రి వివరించారు.పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గంట ముందు  పరీక్షా కేంద్రం లోకి విద్యార్ధులకు అనుమతి ఇస్తామన్నారు.

ప్రైవేట్ యాజమాన్యాలపై మంత్రి సీరియస్

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల సమయంలో   ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు  పరీక్షల నిర్వహణకు సహకరించాలని ఆమె కోరారు.పరీక్షల టైమ్ లో ఇబ్బందులు పెట్టొద్దని ఆమె సూచించారు. ఇంటర్ విద్యార్ధుల పరీక్షల కోసం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి వస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి పేరేంట్స్ తీసుకొచ్చారు. 

click me!