
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రారంభానికి సిద్దమయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో ఆలయాన్ని పున:ప్రారంబానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే గర్భాలయ విమాన గోపురానికి తిరుమలలో మాదిరిగా స్వర్ణతాపడం చేయించాలని నిర్ణయించినట్లు... ఇందుకోసం దాతల నుండి బంగారాన్ని స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు.
Yadadri నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి తోచినంత సాయం చేసే అవకాశం దక్కడంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. తమకు కలిగిన దాంట్లో ఎంతో కొంత ఆ యాదగిరీషుడికి సమర్పించుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఓ ఐదేళ్ల చిన్నారి కూడా పెద్దమనసుతో బంగారు ఉంగరాన్ని యాదాద్రి దేవాలయానికి విరాళంగా ఇవ్వడానికి సిద్దమయ్యాడు.
ఐదేళ్ళ సన్విత్ వీర్ తనకు తల్లిదండ్రులు చేయించిన బంగారు ఉంగరాన్ని యాదాద్రి దేవాలయ విమాన గోపుర స్వర్ణతాపడం మహత్కార్యం కోసం ఇవ్వనున్నట్లు తెలిపాడు. సీఎం కేసీఆర్ తాత పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలుడు తెలిపాడు.
వీడియో
పెద్దమనసుతో స్వామివారికి తనకు తోచినంత బంగారాన్ని yadadri narasimha swamy కి సమర్పించుకుంటున్న చిన్నారి భక్తుల ప్రశంసలు పొందుతున్నాడు. చిన్నతనంలోనే ఆద్యాత్మిక భావనతో యాదగిరి నరసన్నకు చేతి ఉంగరాన్ని సమర్పిస్తానన్న సన్విత్ వీర్ కు ఆ దేవుడి ఆశిస్సులు మెండుగా లభించాలని కోరుతున్నారు.
యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. సీఎం కేసీఆర్ ప్రకటన
ఇదిలావుంటే సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రి దేవాలయానికి బంగారం విరాళంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇలా తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి ఒక కిలో బంగారం బహూకరించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భక్తికి, గొప్ప సంకల్పానికి తాను చాలా ప్రేర పొందానని... అందుకోసమే నా కుటుంబం, శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చిన్నప రెడ్డి తెలిపారు.
ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద భక్తితో ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ ప్రకటించారు. ఆధునిక చరిత్రలో ఒక ప్రజా పరిపాలకుడు ఇంత గొప్ప వైభవంగా ఒక ఆలయాన్ని పునర్నిర్మించడం ఒక అద్భుతమని దానం పేర్కొన్నారు. సీఎం ఎంతో గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారని... అందుకు తనవంతు సాయంగా బంగారం విరాళంగా ఇస్తున్నట్లు దానం తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సమయంలోనే తన కుటుంబం తరపున కిలో బంగారాన్ని అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే మంత్రి మల్లారెడ్డి, చినజీయర్ స్వామి ఆశ్రమం, మంత్రి హరీష్ తదితరులు కూడా బంగారం ఇవ్వడానికి సిద్దంగా వున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు చాలామంది ముందుకు వచ్చి యాదాద్రి ఆలయానికి బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు.