తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్

By narsimha lodeFirst Published Oct 21, 2021, 1:07 PM IST
Highlights


తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పేరేంట్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని ఆ పిటిషన్ లో కోరారు

హైదరాబాద్: రాష్ట్రంలో Inter first ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ Telangana High court లో గురువారం నాడు petition దాఖలైంది. పేరేంట్స్ సంఘం ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది.ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని ఆ పిటిషన్ లో కోరారు.విద్యార్ధులన పాస్ చేయాలని ఆ పిటిషనర్ కోరారు. పేరేంట్స్ సంఘం తరపున హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

also read:సంప్రదాయ పద్ధతిలోనే మూల్యాంకనం.. ఏపీపీఎస్సీకి హై కోర్టు షాక్...

ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25వ తేదీ నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఈ మాసంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని  నిర్ణయం తీసుకొన్నారు.ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అధికారులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..

గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని మంత్రి చెప్పారు. 25 వేల మంది ఇన్విజిలేటర్‌లు పాల్గొంటున్నారని, పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


 


 

click me!