రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

By Asianet NewsFirst Published May 8, 2023, 10:22 AM IST
Highlights

విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. దీని కోసం విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు విడుదల కానున్నాయి. దీని కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను విద్యార్థులు చూసుకోవచ్చు.

బెంగళూరు థియేటర్ లో ‘ది కేరళ స్టోరీ’ చూసిన నడ్డా.. విషపూరిత ఉగ్రవాదాన్నిసినిమా బహిర్గతం చేస్తుందంటూ కామెంట్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 2023 మార్చి 15 నుంచి 2023 ఏప్రిల్ 3 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16, 2023 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్ రెండింటిలోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షల్లో పాస్ కాని విద్యార్తులకు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం

విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవాలంటే tsbie.cgg.gov.inను సందర్శించాలి. అందులో హాల్ టిక్కెట్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ లేదా సెకెండియర్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

click me!