టెక్సాస్ షాపింగ్ మాల్ కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి..

By SumaBala BukkaFirst Published May 8, 2023, 8:32 AM IST
Highlights

అమెరికాలోని షాపింగ్ మాల్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి చెందింది. ఆమె పేరు తాటికొండ ఐశ్వర్య. అక్కడి ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. 

అమెరికాలోని టెక్సాస్ లో  షాపింగ్ మాల్ లో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో తెలుగు అమ్మాయి ఉందని సమాచారం. తాటికొండ ఐశ్వర్య అనే 27 సంవత్సరాల తెలుగు అమ్మాయి మృతి చెందినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ కొత్తపేట, సరూర్ నగర్ కు చెందిన ఐశ్వర్య.. కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అక్కడి తెలుగు సంఘాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాటికొండ ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి, అరుణల కూతురు. అమె అక్కడి ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. అమెరికా టెక్సా షాపింగ్ మాల్ లో దుండగులు జరిగిన కాలంలో 9 మంది మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా ఈ దుండగుల మీద పోలీసులు జరిపిన కార్పూర్ లో ఒక దుండగుడు మరణించాడు.

కాగా, ప్రమాద సమయంలో అదే మాల్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి దుండగుడిని గుర్తించి కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. ఈ కాల్పుల్లో గాయపడిన క్షతగాత్రులను మూడు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదు సంవత్సరాల నుండి 60 ఏళ్లలోపు వారు ఉన్నారని అధికారులు తెలిపారు. టెక్సాస్ గవర్నర్ ఈ ఘటనను అంతులేని విషాదంగా పేర్కొన్నారు. 

ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జరిగింది. షాపింగ్ మాల్ లోనే కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు..  ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో మరో ఇద్దరు మరణించారు.  ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తేలింది.

ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే తుపాకులతో కాల్పులకు దిగుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.  అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ ఈ ఘటనలకు కారణం  అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాల్పులు జరిపిన సమయంలో దుండగుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడని అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడు తెలియలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

click me!