తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (telangana congress government)పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు చేశారు. బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీ (Adani)తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు.
బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో అదానీతో పోరాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోందని ప్రశ్నించారు.
లిక్కర్ పాలసీ స్కామ్ లో కేసులో నిందితుడిని కాదు.. మరెందుకు సమన్లు పంపారు - ఈడీతో కేజ్రీవాల్
మోడీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అంటారని, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ, అదానీ ఒక్కటే అని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ లో ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది అవకాశవాద, నీచ స్థాయి రాజకీయమని ఆరోపించారు.
తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్… pic.twitter.com/rgp1XAT0CB
రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో పలు వ్యాపారాలలో రూ.12400 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.
అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ రకాలుంటాయా ? - బండి సంజయ్
కాంగ్రెస్ చేసిన మొత్తం వాగ్దానాల సంఖ్య 420 అని కేటీఆర్ అన్నారు. వాటి గురించి ప్రజలకు, అధికార పార్టీకి గుర్తు చేయడం తమ పార్టీ బాధ్యత అని తెలిపారు. కాగా.. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు ఎంవోయూలను కొన్ని సంవత్సరాల కోసం మార్చుకుంది.