ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే

By narsimha lode  |  First Published Jan 18, 2024, 3:26 PM IST

కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు  ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కానున్నారు.



హైదరాబాద్: తెలంగాణలో  ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ  స్థానాలకు  బల్మూరి వెంకట్,  మహేష్ కుమార్ గౌడ్ లు  గురువారంనాడు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు  బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను  కాంగ్రెస్ నాయకత్వం  ఈ నెల  17న ఖరారు చేసింది. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ల నామినేషన్ల కార్యక్రమంలో  తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  పాల్గొన్నారు.

also read:జీహెచ్ఎంసీపై ఫోకస్: కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

Latest Videos

undefined

స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి  కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో  ఎమ్మెల్సీ పదవులకు వీరిద్దరూ  రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు  ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.ఇవాళ్టితో నామినేషన్ల గడువుకు చివరి తేది. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే ఈ నెల  29వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.

also read:గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయం: ఆశావాహులకు నిరాశ

ఈ రెండు స్థానాలకు   ఈ నెల  12న వేర్వేరుగా  నోటిఫికేషన్లు జారీ చేసింది ఎన్నికల సంఘం .దీంతో  ఈ రెండు స్థానాలు కూడ  కాంగ్రెస్ కు దక్కనున్నాయి.  తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్ కు  64 స్థానాలున్నాయి.  సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తుంది.  దీంతో తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్ బలం  65 గా ఉంది.   

also read:కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

తెలంగాణ అసెంబ్లీలో  బీఆర్ఎస్ కు  39 మంది,  ఎంఐఎంకు  7, బీజేపీకి  8 మంది ఎమ్మెల్యేలున్నారు.  దీంతో  ఈ రెండు స్థానాలు  కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది.   దీంతో  కాంగ్రెస్ పార్టీ మినహా ఇతర పార్టీ  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. దరిమిలా  నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం లేకపోలేదు. అయితే నామినేషన్ల పరిశీలన తర్వాత ఈ నెల  22న వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది.

 


 

click me!