
నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంపై అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీగా చర్చ జరిగింది. ఇరు పక్షాల నేతలు మాటల యుద్ధానికి దిగారు. దీంతో చాలా కాలం తరువాత సభలో ఆసక్తికరమైన వాతావరణం కనిపించింది. అయితే ఈ సమావేశాలు శనివారం ముగియగా.. మూడు రోజుల అనంతరం బుధవారం మళ్లీ ప్రారంభం కానున్నాయి.
దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? మరణ వార్తలపై ఛోటా షకీల్ ఏమన్నాడంటే ?
నేటి నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆర్థిక స్థితిగతి, సాగునీరు, విద్యుత్ రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన అప్పులు, అమలు చేసిన విధానాలను అధికార కాంగ్రెస్ విరుచుకుపడే అవకాశం ఉంది.
గ్యారెంటీల అమలుకు 100 రోజులే గడువు.. తరువాత పోరాటాలే - గంగుల కమలాకర్
అయితే దీనిని తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తెలియజేసేలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని భావిస్తోంది. దీనికి అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే సేకరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు, ఇతర ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.
మైనర్ బాలికపై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
వీరంతా బుధవారం సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన అంశాలపైను చర్చించినట్టు సమాచారం. తమకు పీపీటీ కోసం అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు స్పీకర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు. అయితే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఒక వేళ స్పీకర్ బీఆర్ఎస్ పీపీటీకి అనుమతి తెలిపితే సభలో మళ్లీ వాడీ వేడీ వాతావరణం, మాటల యుద్ధం కనిపించే అవకాశం ఉంది.