హరీష్‌రావు లేకుంటే కేసీఆర్ లేడు: రేవూరి

By narsimha lode  |  First Published Nov 8, 2018, 4:08 PM IST

హరీష్ రావు  లేకుంటే కేసీఆర్ లేనే లేడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు.కేసీఆర్ కుట్రలతో తెలంగాణ టీడీపీ బలహీనపడిన మాట వాస్తవమేనన్నారు. 
  



అమరావతి: హరీష్ రావు  లేకుంటే కేసీఆర్ లేనే లేడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు.కేసీఆర్ కుట్రలతో తెలంగాణ టీడీపీ బలహీనపడిన మాట వాస్తవమేనన్నారు. 
  
గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.పొత్తుల విషయంలో గందరగోళం లేదని రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తమకు 14 సీట్లు ఇస్తామంటోంది... కానీ 18 సీట్లు కావాలని తాము  కోరుతున్నామన్నారు. కూటమి విచ్ఛిన్నం కాకూడదనే భావనలో అన్ని పార్టీలు ఉన్నాయని రేవూరి చెప్పారు.

ప్రజల్లో బలంగా ఉన్నా.... వ్యవస్థాగతంగా పార్టీ ఇబ్బంది పడుతోందన్నారు. నర్సంపేట అసెంబ్లీ స్థానం టీడీపీకే దక్కుతోందని తాను నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు.

Latest Videos

తనపై ఉన్న అపోహలు తొలగించుకొనేందుకు హరీష్ రావు లేఖ పేరుతో రాజకీయం చేస్తున్నారని రేవూరి విమర్శించారు. హరీష్‌రావు ను సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు మాత్రమే  పరిమితం చేశారన్నారు.

తనకు ప్రాధాన్యత లేదని గతంలోనే హరీష్‌రావు అలిగిన విషయాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండడానికి  చంద్రబాబునాయుడు  కారణమని రేవూరి చెప్పారు.ప్రాజెక్టుల విషయంలో  దిగువ రాష్ట్రాల ఆందోళనలు  సహజమేనని రేవూరి తెలిపారు. ఇబ్బందులుంటే  సరైన వేదికల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 

 

సంబంధిత వార్తలు

అప్పుడే వెనక్కి తగ్గుతా: హరీష్ పై వ్యాఖ్యల మీద రేవూరి

కట్టుబడి ఉన్నా: హరీష్‌ మీది వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

click me!