తెలంగాణలో మరో ''పొత్తు''పొడుపు...

By Arun Kumar PFirst Published Nov 8, 2018, 3:14 PM IST
Highlights

తెలంగాణలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలన్ని గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికలు, ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీని గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నింటిని(టిడిపి, టీజెఎస్, సిపిఐ) కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే తాజాగా బిజెపి పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో భాగంగా కొత్త పొత్తులకు తెరలేపింది. 
 
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలసి యువ తెలంగాణ పార్టీ పోటీ చేయబోతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు.  బీజేపీతో కలసి పోటీ చేయాలని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలతో ఏర్పాటు చేసిన ''మహాకూటమి'' మహా ఓటమి దిశగా అడుగులు వేస్తోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక అధికార పార్టీకి కూడా ఈ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోతుందన్నారు. కేటీఆర్ తన స్థాయికి మించిన మాటలు మాట్లాడటం మానుకోవాలని లక్ష్మణ్ సూచించారు. 

click me!