గద్దర్ కు రాహుల్ మొండి చేయి: కేసీఆర్‌పై ఇండిపెండెంట్‌గా బరిలోకి....

By narsimha lodeFirst Published Nov 8, 2018, 2:20 PM IST
Highlights

గజ్వేల్‌ నుండి  తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని  ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రకటించారు. 


హైదరాబాద్: గజ్వేల్‌ నుండి  తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని  ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రకటించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని ఆయన తేల్చి చెప్పారు. 

గురువారం నాడు హైద్రాబాద్‌లో గద్దర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు భద్రత కల్పించాలని  సీఐడీ డీజీని కోరినట్టు గద్దర్ తెలిపారు. 

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత  రాజరికపు పాలన కొనసాగిందని గద్దర్ ఆరోపించారు.   తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్దరించబడాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 

ఈ నెల 15 నుండి తెలంగాణలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్టు గద్దర్ ప్రకటించారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమైందని గద్దర్ అభిప్రాయపడ్డారు.

అన్ని పార్టీలు మద్దతిస్తే తాను గజ్వేల్‌ నుండి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని గద్దర్ గతంలో ప్రకటించారు. అయితే గజ్వేల్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.  

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ ను గద్దర్ కలిసిన సమయంలో గజ్వేల్ నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే విషయాన్ని ప్రతిపాదన పెట్టినా..... కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో గద్దర్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

సంబంధిత వార్తలు

రాహుల్‌ను కలవొచ్చు కానీ కేసీఆర్‌ను కలవలేం: గద్దర్

రాహుల్ గాంధీ కోరిందేమిటి: గద్దర్ వ్యూహం ఏమిటి?

రాహుల్ గాంధీతో భేటీ మతలబు: ఎవరీ గద్దర్?

గజ్వేల్: కేసీఆర్‌పై పోటీకి దిగేదీ గద్దరా, ప్రతాప్ రెడ్డియా?

click me!