విశ్వనగరం కాదు.. విషనగరంగా మార్చారు, రేవంత్ ఇంటిపై దాడిని ఖండించిన మధుయాష్కీ

By Siva KodatiFirst Published Sep 21, 2021, 6:35 PM IST
Highlights

రాష్ట్ర రాజకీయాలన్నీ కేటీఆర్, రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ రెండు నేతల మధ్య మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య ఘర్షణలుగా పరిణమించాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని విషనగరంగా మార్చారని మధుయాష్కీ మండిపడ్డారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని విషనగరంగా మార్చారని మధుయాష్కీ మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులకు పాలించే హక్కు లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర రాజకీయాలన్నీ కేటీఆర్, రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ రెండు నేతల మధ్య మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య ఘర్షణలుగా పరిణమించాయి. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడం, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ALso Read:రేవంత్‌పై పరువు నష్టం దావా: డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కోర్టు ఆదేశాలు

తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్లామని, కానీ, వాళ్లే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు తమవైపు వివరాలను పేర్కొంటున్నారు. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.

click me!