మహిళ న్యూడ్ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని వేధింపులకు గురిచేస్తున్న సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ సీఐని.. వీటితో పాటు అవినీతి ఆరోపణల కింద సస్పెండ్ చేశారు అధికారులు.
వరంగల్ : వరంగల్ లో ఓ సీఐ వేధింపుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తన న్యూడ్ వీడియోలు, ఫోటోలతో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మీద ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్ పీఎస్ లో పనిచేస్తున్న సీఐ సతీస్ కుమార్ ను సస్పెండ్ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
తన భర్త కొంతమంది మహిళల న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్ పీఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేలు లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి. సీఐ వ్యవహారాలమీద విచారణ చేపట్టిన సీపీ తరుణ్ జోషి.. సతీష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.
undefined
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బరేలీలోని బహేరి పోలీస్ స్టేషన్‌లో, ఇద్దరు కానిస్టేబుళ్లు మరో మహిళా కానిస్టేబుల్ గురించి బాహాబాహికి దిగారు. అంతటితో ఆగకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మీద అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇక ఘటన వివరాల్లోకి వెడితే...
బతుకమ్మ ఆడుతున్న భార్యపై ఇనుపరాడ్ తో దాడి చేసి, హత్య చేసిన భర్త..
ఆ కానిస్టేబుళ్లు ఇద్దరూ 25-30యేళ్ల మధ్యవయస్కులే. తమ సహోద్యోగి అయిన ఓ మహిళా కానిస్టేబుల్ తో ఎఫైర్ విషయంలో వీరి మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చెలరేగి అది తీవ్ర గొడవగా మారింది. దీంతో ఆ ఇద్దరిలో ఒకరైన మోను కుమార్ సర్వీస్ రివాల్వర్ తో స్టేషన్‌లో కాల్పులు జరిపాడు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే తూటాలు ఎవ్వరికీ తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అతను కేవలం పట్టరాని కోపంతో కాల్చాడు అంతేకానీ, ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని.. బుల్లెట్లు నేలకే తాకాయని.. ఒక పోలీసు చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వారు మోను కుమార్, మరో కానిస్టేబుల్, యోగేష్ చాహల్, ఇన్‌స్పెక్టర్ (క్రైమ్), SHOతో సహా ఐదుగురు పోలీసులను ఎస్సెస్పీ సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ "క్రమశిక్షణా చర్యలకింద" సస్పెండ్ చేశారు. వీరిని పోలీసు లైన్‌లకు అటాచ్ చేశారు. ఈ ఘటన మీద అంతర్గత విచారణకు కూడా ఆదేశించారు. దీనిమీద ఎస్సెస్పీ సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ మాట్లాడుతూ "ఒక పోలీసు సహోద్యోగితో ఎఫైర్ పెట్టుకుంటే.. అది అతని వ్యక్తిగత విషయం. అందులో అభ్యంతరకరం చెప్పడానికి ఏమీ లేదు. అందులో చట్టవిరుద్ధమైనది కూడా ఏమీ లేదు. అందుకే ఈ ఘటనలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం అనే కారణాలపై మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయి" అని తెలిపారు.
నిందితుల్లో ఒకరైన కుమార్ పశ్చిమ యూపీలోని బాగ్‌పత్ జిల్లాకు చెందినవాడు. డిసెంబర్ 2019లో బహేరి పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాడు. అతని పొరుగు జిల్లా ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ ఈ సంవత్సరం ప్రారంభం జనవరిలో అదే పోలీస్ స్టేషన్‌లో చేరింది. "కుమార్, ఆ మహిళా కానిస్టేబుల్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. ఆమెకు బహేరీ స్టేషన్‌లో పోస్టింగ్ రాకముందునుంచే.. నిరుడు యేడాది నుంచే వారి మధ్య రిలేషన్ ఉంది. వారిద్దరి కులాలు వేర్వేరు. దీంతో వీరి సంబంధం గురించి తెలిసిన కానిస్టేబుల్ చాహల్ పిచ్చి కామెంట్స్ చేసేవాడు. కాల్పుల ఘటన చోటుచేసుకోవడానికి రెండు రోజుల ముందు కూడా వీరి గురించి చులకనగా మాట్లాడడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.