డేటా లీక్‌పై సిట్ దూకుడు: ఎనిమిది బ్యాంకులు సహా పలు సంస్థలకు నోటీసులు

By narsimha lode  |  First Published Apr 2, 2023, 2:59 PM IST

డేటా లీక్ అంశంపై  సిట్ మరింత దూకుడును పెంచింది.   ఎనిమిది బ్యాంకులకు సిట్  నోటీసులు జారీ చేసింది. 
 



హైదరాబాద్: డేటా లీక్ పై  దర్యాప్తును  సిట్   మరింత వేగవంతం  చేసింది.  డేటా లీక్ ఘటనలో   ఎనిమిది బ్యాంకులు , పలు సంస్థలకు  సిట్  నోటీసులు  జారీ చేసింది. దేశంలోని  సుమారు  66 కోట్ల మంది వ్యక్తిగత డేటాను  ఈ ముఠా చోరీ చేసిందని  పోలీసులు గుర్తించారు  ఈ ఏడాది మార్చి  23న  ఈ ముఠా గురించి  సైబరాబాద్ పోలీసులు మీడియాకు వివరించారు.  అ కేసు  విచారణను  సిట్ కు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. డేటా చోరీ కేసులో  25 కంపెనీలకు  పోలీసులు నోటీసులు జారీ చేశారు.  160. 91 సీఆర్‌పీసీ  సెక్షన్ల కింద  నోటీసులు ఇచ్చారు.  

ఈ కేసులో  గత నెల  23న  9 మందిని అరెస్ట్  చేశారు. మరో వైపు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన  వినయ్ భరద్వాజ్ ను నిన్న  పోలీసులు అరెస్ట్  చేశారు. దేశంలోని  24 రాష్ట్రాలతో పాటు  , 8 మెట్రో నగరాలకు  చెందిన  ప్రజల డేటాను  భరద్వాజ్  సేకరించారన్నారు.ఈ డేటాను  నిందితుడు  సైబర్ నేరగాళ్లకు విక్రయించారని  పోలీసులు తెలిపారు. 

Latest Videos

undefined

ఈ కేసు విషయమై  ఎనిమిది  బ్యాంకులకు  సిట్  నోటీసులు జారీ చేసింది. జస్ట్ డయల్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్,  పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ,ఇన్ స్టాగ్రామ్ లకు  కూడా   నోటీసులు పంపారు పోలీసులు.డేటా సేకరణ కోసం  వినయ్ భరద్వాజ్ దేశంలోని పలు ప్రాంతాల్లో  ఉద్యోగులను నియమించుకున్నారని పోలీసులు గుర్తించారు.

also read:డేటా లీక్ కేసులో కీలక మలుపు : 66 కోట్ల మంది డేటా లీక్, కీలక సూత్రధారి అరెస్ట్.. 4.5 లక్షల మంది ఉద్యోగులతో దందా

డేటా  లీక్ అంశంపై  కేంద్రం కూడా  కేంద్రీకరించింది.  ఆర్మీ, డిఫెన్స్  ఉద్యోగులకు  సంబందించిన  సమాచారాన్ని   కూడా  నిందితులు  చోరీ చేశారని   సమాచారం  బయటకు వచ్చింది.  దీంతో కేంద్రం కూడా  ఈ విషయమై  కేంద్రీకరించింది.  మరో వైపు  ఈ విషయమై ఈడీ రంగంలోకి దిగింది.  డేటా లీక్  విషయంలో  మనీలాండరింగ్  జరిగిందని  ఈడీ  భావిస్తుంది. ఈ విషయమై  ఈడీ అధికారులు దర్యాప్తు  కొనసాగిస్తున్నారు.డేటా లీక్ కేసులో  అరెస్టైన నిందితులను  సిట్ బృందం  కస్టడీలోకి  తీసుకుని విచారిస్తుంది. 

click me!