విపక్షాల మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై హరీష్ రావు

By narsimha lode  |  First Published Apr 2, 2023, 2:32 PM IST

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  అంశంపై మంత్రి హరీష్ రావు  స్పందించారు.   ఈ విషయమై  విపక్షాలు చేసే ప్రచారాన్ని  నమ్మవద్దని  హరీష్ రావు  కోరారు. 



సిద్దిపేట: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశాన్ని   ప్రభుత్వమే బయటపెట్టిందని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.  పేపర్ లీకేజీని  ప్రతి పక్షాలు బయట పెట్టలేదన్నారు.  పేపర్ లీక్ అంశాన్ని  ప్రభుత్వమే బయటపెట్టిందని హరీష్ రావు  గుర్తు  చేశారు.  పేపర్ లీక్  కేసు నిందితులపై  కేసులు పెట్టి  కఠిన చర్యలు  తీసుకున్నామన్నారు.ఆదివారంనాడు  నారాయణపేటలో  జరిగిన  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో  ఆయన ప్రసంగించారు.   80వేల ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.  

 ప్రతి పక్షాల మాటలు నిరుద్యోగులు నమ్మొద్దని  ఆయన  సూచించారు. విపక్షాల మాటలను నమ్మితే నడి సముద్రంలో మునిగినట్టేనని  హరీష్ రావు  చెప్పారు. వాయిదా, రద్దైన పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని  మంత్రి హరీష్ రావు  హమీ ఇచ్చారు.  పేపర్ లీక్ ఘటన దురదృష్టకరంగా  ఆయన  సేర్కొన్నారు. పేపర్లు లీక్ కావద్దన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు  లీక్ైన విషయమై పోలీసులు విచారణ  నిర్వహిస్తున్నట్టుగా హరీష్ రావు గుర్తు  చేశారు.  

Latest Videos

undefined

 ప్రతి పక్షాలు మాట్లాడే మాటలు అన్ని అబద్ధాలేన్నారు.   గ్లోబల్స్ ప్రచారాన్ని  నమ్మవద్దని  మంత్రి ప్రజలను  కోరారు.  దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే బీజేపీ ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో  మోడీ సర్కార్  హామీ ఏమైందని  ఆయన  ప్రశ్నించారు. 

ఈ ఏడాది మార్చి  12, 15, 16 తేదీల్లో    జరగాల్సిన  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్,  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్  పరీక్షలను  తొలుత వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్‌సీ  లోని కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని  తొలుత భావించారు. కంప్యూటర్లు  హ్యాక్ కాలేదని  పోలీసులు నిర్ధారించారు.  పేపర్ లీక్ అయినట్టుగా  పోలీసులు తమ విచారణలో గుర్తించారు.  ఈ విషయమై   పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలిపింది.  ఈ కేసును సిట్ విచారిస్తుంది.   పేపర్ లీక్ అంశంలో ఇప్పటికే  13 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

also read:రైతుల చూపు కేసీఆర్ వైపే: సిద్దిపేట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు

పేపర్ లీక్ అంశంపై  బీజేపీ, కాంగ్రెస్ నేతలు  ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్,  కేటీఆర్ పీఏకు  ఈ వ్యవహరంతో సంబంధాలున్నాయని కూడా  కాంగ్రెస్ నేత  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని  బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్  చేసిన విషయం తెలిసిందే.  విపక్షాల  విమర్శలపై  మంత్రి కేటీఆర్ , బీఆర్ఎస్ నేతలు  ఎదురుదాడికి దిగారు. 

click me!