శిల్పా చౌదరికి బెయిల్:చంచల్‌గూడ జైలు నుండి విడుదల

By narsimha lode  |  First Published Dec 24, 2021, 9:30 AM IST

కిట్టీ పార్టీలు, అధిక వర్డీల పేరుతో మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. గురువారం నాడు షరతులతో కూడిన బెయిల్ ను ఉప్పర్‌పల్లి కోర్టు మంజూరు చేసింది. 


హైదరాబాద్:  కిట్టీ పార్టీలు, అధిక వడ్డీల పేరుతో పలువురిని మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టైన శిల్పా చౌదరి శుక్రవారం నాడు ఉదయం చంచల్‌గూడ మహిళా జైలు నుండి విడుదలయ్యారు. upparapalli court షరతులతో కూడిన Bail ను మంజూరు చేయడంతో  ఇవాళ chanchalguda  జైలు నుండి ఆమె విడుదలయ్యారు. ఈ ఏడాది నవంబర్ 27న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

chanchalgudaపై నమోదైన పలు కేసుల్లో విచారణ నిర్వహించిన ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దివ్యారెడ్డి కేసులో గతంలోనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మరో రెండు కేసుల్లో గురువారం నాడు ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె ఇవాళ జైలు నుండి విడుదలయ్యారు.

Latest Videos

undefined

అయితే ఈ కేసుకు సంబంధించిన వారెవరిని కూడా కలవకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రతి శనివారం నాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కూడా కోర్టు కోరింది. 

also read:శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

శిల్పా చౌదరిని మూడు దఫాలు నార్సింగి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే శిల్పా చౌదరి మాత్రం నోరు మెదపలేదు.  అయితే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో శిల్పా చౌదరి పెట్టుబడులు పెట్టినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.

అయితే ఈ విషయమై కూడా ఆమెను పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో శిల్పా చౌదరి నోరు మెదపలేదు. శిల్పా చౌదరి ఇంట్లో డాక్యుమెంట్లు లభించలేదు. shilpa chowdaryకి చెందిన యాక్సిస్ బ్యాంకు లాకర్లో కూడా ఎలాంటి నగదు, బంగారు ఆభరణాలు లభ్యం కాలేదు. అయితే శిల్పా చౌదరి తీసుకొన్న డబ్బులు ఎటు మళ్లించిందనే విషయమై పోలీసులు ఇంకా గుర్తించలేదు.  శిల్పా చౌదరి పథకం ప్రకారంగానే డబ్బు, బంగారు ఆభరణాలను మాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం.శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని  చెప్పారని తెలుస్తోంది.

పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.  ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు

click me!