బైక్ కారణంగా లారీ.. బస్సు ఢీ.. యాదాద్రి భువనగిరిలో యాక్సిడెంట్

Published : Dec 24, 2021, 02:48 AM ISTUpdated : Dec 24, 2021, 03:28 AM IST
బైక్ కారణంగా లారీ.. బస్సు ఢీ.. యాదాద్రి భువనగిరిలో యాక్సిడెంట్

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ బైక్ కారణంగా లారీ, బస్సు ఢీకొన్నాయి. రోడ్డుపై బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోవడంతో అది చూసి అటుగా వస్తున్న లారీ ఉన్నపళంగా బ్రేకులు వేయడంతో నిలిచిపోయింది. కానీ, దాని వెనుకే వస్తున్న బస్సు ఆ కొద్ది సమయంలో బ్రేకులు వేసినా ఆగకుండా లారీ వెనుకను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.  

హైదరాబాద్: రోడ్డు ఎక్కామంటే అన్ని వైపులా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేయాలి. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుటి వాహనం అదుపు తప్పిన ముప్పు తప్పదు. కాబట్టి, రోడ్డుపై ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. ఇంకొన్ని సార్లు ఒక వాహనం కారణంగా వేరే ఇతర వాహనాలూ ప్రమాదాలకు గురవుతుంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ప్రమాదమే(Accident) జరిగింది. రోడ్డుపై బైక్(Bike) ఒక్కసారిగతా కిందపడిపోవడంతో అటు వైపుగా వస్తున్న లారీ వెంటనే సడన్ బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. దాంతో లారీ(Lorry) ఆకస్మికంగా నిలిచిపోయింది. కానీ, దాని వెనుక వస్తున్న బస్సు(Bus) డ్రైవర్‌కు ఈ పరిణామం షాక్ కలిగింది. బ్రేక్‌లు వేసి బస్సును కంట్రోల్ చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురంలో ఈ దుర్ఘటన జరిగింది. జమ్మాపురం స్టేజీ వద్ద ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి హఠాత్తుగా రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో నవతా ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ వెనుక నుంచి వస్తున్నది. బైక్ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా కిందపడిపోవడాన్ని లారీ డ్రైవర్ చూశాడు. అంతే వేగంగా బ్రేకులు వేశాడు. లారీ కంట్రోల్‌లోకి వచ్చింది. బైక్ పైకి వెళ్లేలోపలే అది ఆగిపోయింది. కానీ, ఆ నవతా లారీ  వెనుకే ఓ బస్సు కూడా వస్తున్నది. ఆ బస్సు డ్రైవర్‌కు లారీ ముందు జరుగుతున్న పరిణామం తెలియదు. ఒక్కసారిగా లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకే వస్తున్న బస్సు లారీని ఢీకొంది. లారీ వెనుకను బస్సు ఢీ కొట్టింది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు దుర్మరణం.. తొమ్మిది మందికి గాయాలు

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీని ఢీ కొన్నందున అందులో 15 మందికి గాయాలయ్యాయి. మహిళా కండక్టర్‌కు ఏకంగా చేయి విరిగింది. క్షతగాత్రులను వెంటనే బీబీనగర్ ఎయిమ్స్, జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

వరంగల్ చల్వాయి గోవిందరావు పేట గ్రామాల మధ్య బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలం పోతిరెడ్డి పల్లితో పాటు ఇరుగుపొరుగు గ్రామాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ చేరుకున్నారు. పత్తి, మిర్చి అమ్ముకున్నారు. వ్యాన్‌లో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా, చల్వాయ్ దగ్గర ఓ లారీ లోడ్ చేస్తున్నారు. వడ్ల బస్తాలను ఆ లారీలో ఎక్కిస్తున్నారు. రైతులతో వెళ్తున్న వ్యాన్ ఆ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది.

Also Read: Sangareddy Accident: కలల బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఘోరం... యువకుడు మృతి

ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, ఘటనా స్థలిలోనే కుంజ శ్రీనివాస్ అనే అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. కాగా, గాయపడిన మిగితా వారిని 108 అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు