తెలంగాణలో న్యూయర్, క్రిస్మస్ వేడుకలు రద్దు.. నేడు తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

Published : Dec 24, 2021, 08:56 AM IST
తెలంగాణలో న్యూయర్, క్రిస్మస్ వేడుకలు రద్దు.. నేడు తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

సారాంశం

ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేయనుంది. ఈ విషయంలో ఈ రోజు  తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక ప్రభుత్వాలు వేడుకలను రద్దు చేశాయి. 

ఒమిక్రాన్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. అన్ని దేశాల్లో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. యూకేలో అయితే ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఒకే రోజు 10 వేల‌కు పైగా ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అక్క‌డ డెల్టా వేరియంట్ కూడా దాని కంటే వేగంగానే దూసుకుపోతోంది. ఆ వేరియంట్ కేసులు రోజుకు 90 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. అధిక జ‌నాభా ఉన్న దేశాల్లో ఈ ఒమిక్రాన్ ను అదుపులోకి తీసుకురావ‌డం క‌ష్టంగా మారే అవ‌కాశం ఉంది. దీంతో అన్ని దేశాలు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే 37 దేశాల‌కు ఈ ఒమిక్రాన్ వ్యాపించింది. ఇది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించిన లెక్క‌లు. నిజానికి ఈ సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. ఒమిక్రాన్ ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చినా.. ఇప్పుడు అన్ని దేశాల్లో త‌న ప్ర‌భావం చూపిస్తోంది. 

బైక్ కారణంగా లారీ.. బస్సు ఢీ.. యాదాద్రి భువనగిరిలో యాక్సిడెంట్

వేడుక‌లపై ఆంక్షలు...
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో గ‌తంలో ఉన్న డెల్టా వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ మూడు రేట్లు అధిక వేగంతో వ్యాప్తి చెందుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీంతో ఈ వైర‌స్ వ్యాప్తి చెందిన దేశాలు అలెర్ట్ అయ్యాయి. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు ప్రారంభించాయి. మ‌న దేశంలో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ కేసులు మూడు వందల‌కుపైగా చేరుకున్నాయి.  డిసెంబ‌ర్ రెండో తేదీన ఇండియాలో మొద‌టి సారిగా 2 కేసుల‌ను గుర్తించారు. ఈ 22 రోజుల్లోనే ఈ సంఖ్య మూడు వంద‌ల‌ను దాటింది. క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలోనూ ఇలాగే వేగం క‌నిపించింది. నెల‌న్న‌ర రోజుల త‌రువాత కేసులు అధికంగా న‌మోదవుతుండ‌టంతో క‌రోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం త‌న చివరి అస్త్రం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఇప్పుడు కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించ‌డం ప్రారంభిస్తున్నాయి. 

గ‌త రెండు వేవ్‌లు, లాక్ డౌన్‌ల అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఒక వేళ లాక్ డౌన్ విధించాల్సి వ‌స్తే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత క్షీణిస్తుంది. నిరుద్యోగం పెరుగుతుంది. నిత్య‌వ‌స‌ర ధ‌రలు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటి ప‌రిస్థితి రాకుండా ప్ర‌భుత్వాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్న న్యూయ‌ర్‌, క్రిస్మ‌స్ వేడుకుల‌ను, ఇత‌ర స‌భ‌లు, స‌మావేశాల‌ను ర‌ద్దు చేస్తున్నాయి. ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాలు ఈ విష‌యంలో ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా వెళ్ల‌నుంది. 

తెలంగాణ: కొత్తగా 177 మందికి కరోనా.. హైదరాబాద్‌లో అత్యధికం, రాష్ట్రంలో పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు

తెలంగాణ హైకోర్టు సూచ‌న‌ల‌తో...
ఒమిక్రాన్ క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించింది. హైకోర్టు సూచ‌న‌ల ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. హైకోర్టు సూచ‌న‌లు గౌర‌విస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు నిన్న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో ఈరోజు మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించి తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే హైకోర్టు కేవ‌లం వేడుక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచించింది. కానీ బార్లు, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్స్‌, ఇత‌ర క‌ల్చ‌ర‌ర్ ప్రోగ్రామ్స్ విష‌యంలోనూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రోజు స‌మావేశం అనంత‌రం తుది నిర్ణ‌యం వెలువ‌రించ‌నుంది. 


 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్