సమత కేసులో దోషులకు ఉరి: ఎస్పీ కాళ్లు మొక్కిన భర్త గోపి

By narsimha lodeFirst Published Jan 30, 2020, 1:59 PM IST
Highlights

సమత కేసులో దోషులకు ఉరి శిక్ష విధించడంతో భర్త సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో  తీర్పు వెలువడిన తర్వాత ఆయన సంతోషంతో కన్నీళ్లు పెట్టుకొన్నారు. 


ఆదిలాబాద్: తన భార్య సమతపై గ్యాంగ్‌రేప్ చేసి, హత్య చేసిన ఘటనపై ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించడంపై  మృతురాలి భర్త గోపి హర్షం వ్యక్తం చేశారు.

గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో  ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించడంతో  కోర్టు హల్ నుండి సంతోషంతో మృతురాలి భర్త గోపి నవ్వుతూ బయటకు వచ్చారు.

తన భార్యపై గ్యాంగ్‌రేప్ చేసి హత్య చేసిన ఘటనపై స్థానిక పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా నిందితులను పట్టుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని గోపి గుర్తు చేశారు ఈ కేసులో  నిందితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను గోపి ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

Also read:సమత కేసు: నిందితులకు ఉరి శిక్ష విధింపు

సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష... గ్రామస్తులు ఏమంటున్నారంటే

సమత కేసులో సంచలన తీర్పు: దోషులకు ఉరి శిక్ష

తన భార్యను హత్య చేసిన నిందితులకు శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించిన పోలీసులకు సమత భర్త చేతులు జోడించి దండం పెట్టారు. ఈ కేసులో పోలీసులతో పాటు మీడియా కూడ మ కుటుంబానికి  న్యాయం జరిగేలా  కృషి చేశారని ఆయన చెప్పారు.కోర్టు ఆవరణలో సమత భర్త గోపి  జిల్లా  ఎస్పీ వద్దకు వెళ్లి తన కన్నీళ్లు పెట్టుకొన్నారు. కేసును చేధించిన పోలీసులను కన్నీళ్లతో ధన్యవాదాలు తెలిపారు.

తన పిల్లలను తల్లి లేని లోటును తీర్చలేమని  సమత భర్త స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా కృషి చేసిన వారికి గోపి కన్నీళ్లతో ధన్యవాదాలు తెలిపారు. 

సమత కేసు: కోర్టు హాల్‌లో కన్నీళ్లు పెట్టుకొన్న నిందితులు

 

 

click me!