సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

Published : Sep 20, 2018, 04:08 PM IST
సైకోలా చేస్తాడనే  పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

సారాంశం

సందీప్‌తో  మాధవి పెళ్లి విషయం  డాడీకి తెలియదన్నారు... పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌కు  పిలిచిన సమయంలోనే మాధవి సందీప్‌ను పెళ్లి చేసుకొన్న విషయం డాడీకి తెలిసిందని  మాధవి సోదరుడు సాయికృష్ణ చెప్పారు.


హైదరాబాద్: సందీప్‌తో  మాధవి పెళ్లి విషయం  డాడీకి తెలియదన్నారు... పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌కు  పిలిచిన సమయంలోనే మాధవి సందీప్‌ను పెళ్లి చేసుకొన్న విషయం డాడీకి తెలిసిందని  మాధవి సోదరుడు సాయికృష్ణ చెప్పారు.

ఓ న్యూస్ ఛానెల్‌కు మాధవి సోదరుడు సాయికృష్ణ  ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మాధవి గురించిన విషయాలను వెల్లడించారు. సందీప్ ను రెండు  రోజుల ముందు పెళ్లి చేసుకొనే ముందు  ఈ విషయాన్ని  మాధవి ఇంట్లో చెప్పిందన్నారు.

 ఈ విషయం డాడీకీ తాము చెప్పలేదన్నారు.  డాడీ మద్యం తాగితే సైకోలాగా ప్రవర్తిస్తాడన్నారు. అందుకే ఈ విషయాన్ని చెప్పలేదన్నారు.  మద్యం తాగితే డాడీ ఎలా ప్రవర్తిస్తాడో గుర్తు చేస్తూ పెళ్లి విషయాన్ని మర్చిపోవాలని తాను మాధవికి సూచించినట్టు సాయికృష్ణ చెప్పాడు.

అయితే సందీప్ ను మర్చిపోతానని మాధవి తనతో చెప్పిందన్నారు.  కానీ, తనకు చెప్పిన మాటను  మర్చిపోయి.. సందీప్‌తో రెండు రోజులకే  పెళ్లి చేసుకొందన్నారు. తాను కాలేజీ నుండి ఇంటికి వచ్చేలోపుగానే ఇలా జరిగిందన్నారు.

కుటుంబసభ్యులు లేకుండా పెళ్లి చేసుకోనని మాధవి చెప్పిన విషయాన్ని సాయికృష్ణ గుర్తు చేశారు. అయితే  ఈ మాటలను చెప్పి తమను ఆమె నమ్మించిందన్నారు. కానీ, తనకు చెప్పలేదని డాడీ బాధపడుతున్నాడన్నారు.

సంబంధిత వార్తలు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu