అమృత వర్షిణికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్: మంత్రి జగదీష్ రెడ్డి

Published : Sep 20, 2018, 03:17 PM IST
అమృత వర్షిణికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్: మంత్రి జగదీష్ రెడ్డి

సారాంశం

ప్రణయ్ కుటుంబసభ్యులను తెలంగాణ రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం నాడు  పరామర్శించారు

మిర్యాలగూడ:  ప్రణయ్ కుటుంబసభ్యులను తెలంగాణ రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం నాడు  పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఆయన ప్రకటించారు.

అమృతవర్షిణిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందన్నారు. ప్రణయ్ హత్య  ముమ్మాటికి పరువు తక్కువ ఘటనగానే ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకొనేవిధంగా  ఉందన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

అమృతవర్షిణిని ఆదుకొనేందుకు ప్రభుత్వం నుండి రూ. 8.25 లక్షలు ఆర్థిక సహాయం చేయనున్నట్టు  జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ రూ.4లక్షల12వేల చెక్ ను అమృతకు మంత్రి అందించారు. అమృతవర్షిణికి వ్యవసాయ భూమి, డబుల్ బెడ్‌రూమ్ తో  పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడ ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. 

 


 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్