ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

By narsimha lode  |  First Published Nov 1, 2019, 3:05 PM IST

ఆర్టీసీకి సంబంధించిన ఆర్ధిక స్థితి గతులపై టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు హైకోర్టుకు నివేదిక అందించింది.ఈ నివేదిక  ఆధారంగా ఆర్టీసీ సమ్మె విషయమై హైకోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.



హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ సంస్థ ఆర్ధిక స్థితిగతులతో పాటు నష్టానికి గల కారణాలను ఆ అఫిడవిట్‌లో ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.అయితే ఆర్టీసీ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు మండిపడింది. తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు  ముందే ఆర్టీసీకి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

Latest Videos

undefined

Also Read:RTC Strike: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

ఈ ఆదేశాలకు అనుగుణంగా  తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్  దాఖలు చేసింది. శుక్రవారం నాడు హైకోర్టు విచారణ సందర్భంగా  ఇంచార్జీ ఆర్టీసీ ఎండీతో పాటు ఆర్టీసీ జేఎసీ నేతలు హైకోర్టుకు హాజరయ్యారు.

ఆర్టీసీ స్థితిగతులపై ఆర్టీసీ యాజమాన్యం తరపున ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ శుక్రవారం  నాడు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.. ఆర్టీసీకి ప్రభుత్వం సహాయం అందిస్తున్నట్టుగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సమ్మె ప్రారంభమైనా అక్టోబర్ 5 నుండి 30వ తేదీ వరకు ఆర్టీసీ సమ్మె కాలంలో రూ. 78 కోట్లను ఆర్జించినట్టుగా సునీల్ శర్మ హైకోర్టుకు వివరించారు. 2018-19 సంవత్సరానికి గాను  తెలంగాణ ప్రభుత్వం రూ. 644.51 కోట్లను ఆర్టీసీకి చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. 

ఆర్టీసీలో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. డీజీలో భారం కూడ నష్టాలకు కారణంగా మారిందని ఈ అఫిడవిట్‌లో ఆర్టీసీ అభిప్రాయపడింది.హైద్రాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులను తిప్పినందుకు గాను రూ. 1744 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జీహెచ్ఎంసీని కోరింది.

Also Read:RTC strike: విలీనం పక్కనబెట్టి.. మిగిలిన డిమాండ్లు చూడాలన్న హైకోర్టు

అయితే రెండేళ్లపాటు రూ. 244 కోట్లు మాత్రమే చెల్లించిన జీహెచ్ఎంసీ ఆ తర్వాత ఈ నిధులను చెల్లించలేమని చేతులెత్తేసింది.దీంతో  దీన్ని బకాయిలుగా చెల్లించలేమని ఆర్టీసీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.  ఆర్టీసీ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు చూపారంటూ హైకోర్టు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బస్సుల కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా నివేదికలో ఎలా పేర్కొంటారని కోర్టు ప్రశ్నించింది. రాయితీల బకాయిలు, డీజీల్, జీతాల చెల్లింపుల కోసం  వాడినట్టు ఆర్టీసీ కోర్టకు అందించిన నివేదికలో పేర్కొంది.నివేదికపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తప్పుడు నివేదికలు ఎందుకు ఇచ్చారని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోసారి వాస్తవాలతో కూడిన నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆర్టీసీ ఇంచార్జీ ఎండి సునీల్ శర్మను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ చేయనుంది.ఈ విచారణ సమయానికి వాస్తవాలతో  కూడిన నివేదికలను అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read:RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మెపై గత నెల 29వ తేదీన హైకోర్టులో విచారించింది. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ  విచారణ సందర్భంగా ఆర్టీసీకి రూ. 1099 కోట్లు బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొంది. గత నెల 29వ తేదీన విచారణ చేసిన హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం నాడు కూడ హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌పై కూడ హైకోర్టు మండిపడింది.

గత విచారణ సమయంలో ఆర్టీసీ అధికారులు సమర్పించిన లెక్కలపై ఆర్టీసీ అధికారులపై హైకోర్టు మండిపడింది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ మృతి... కరీంనగర్ బంద్ పై పోలీసుల ఉక్కుపాదం

రూ. 47 కోట్లను చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించేందుకు సిద్దంగా ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ విషయమై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై  హైకోర్టు ప్రశ్నలు కురిపించింది. ఆస్తుల పంపకం ఎందుకు పూర్తి కాలేదని హైకోర్టు ప్రశ్నించింది.

read more RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి
బ్యాంకు గ్యారంటీ రూ.850 కోట్లు కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా ఎందుకు కట్టలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీలో జరుగుతున్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా అంగీకరించాలని హెచ్చరించింది.  

ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వంపై మండిపడింది.రూ.4,253 అంటూ తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.850 కోట్లు కేవలం బ్యాంకు గ్యారంటీగా మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు ఇవ్వలేరా అంటూ మరోసారి ప్రశ్నించింది ధర్మాసనం.

ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. సమ్మె చట్ట విరుద్దమని చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే తాము అందరి సమస్యలను వినేందుకు ఇక్కడ ఉన్నామని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె చట్టవిరుద్దమని తాము చెప్పలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 


 

click me!