టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు: కేసీఆర్ తేలుస్తారా?

By narsimha lodeFirst Published Nov 1, 2019, 1:19 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతలు నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కేసీఆర్ రంగం సిద్దం చేసే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి. 

హైదరాబాద్: నామినేటేడ్ పోస్టుల కోసం టీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. నామినేటేడ్ పోస్టులు తమకు వస్తాయని చూస్తున్న సమయంలో ఎన్నికలు ఆశవాహులకు నిరాశను మిగులుస్తున్నాయి.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన  టీఆర్ఎస్ నేతలు నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

Also read:Weekend political review: కేసీఆర్ కు ఆర్టీసీ సెగ, హుజూర్ నగర్ ఊరట

నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూసే నేతలకు తొలుత మంత్రివర్గ విస్తరణ అడ్డుగా మారింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తర్వాత నామినేటేడ్ పోస్టుల కోసం నేతలు మరోసారి ఆశగా ఎదురుచూశారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత నామినేటేడ్ పోస్టులను భర్తీ చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. కానీ, నామినేటేడ్ పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. సీఎం కేసీఆర్ పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డికి నామినేటేడ్ పోస్టు దక్కింది.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి కంటే ముందే పార్టీలో చేరిన నేతలు కూడ నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారికి మాత్రం సీఎం కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ రాలేదు

మరో వైపు నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మంత్రివర్గ విస్తరణ పూర్తైన తర్వాత హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. 

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో  విజయంపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. పార్టీకి చెందిన కీలక నేతలు హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోహరించారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ విజయం టీఆర్ఎస్‌ శ్రేణుల్లో  ఉత్సాహన్ని నింపాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ ఆశావాహులు మరోసారి నామినేటేడ్ పోస్టుల కోసం పార్టీ నాయకత్వాన్ని  ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూడ తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసుకొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో ఉన్న స్టే ను ఎత్తివేయించుకొనే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని  ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ‌ కోర్టు విధించిన స్టే ఎత్తివేతపై నవంబర్ 1వ తేదీన కోర్టు తీర్పును వెలువరిచే అవకాశం ఉంది. మళ్లీ మున్సిపల్ ఎన్నికలు వస్తే నామినేటేడ్ పోస్టుల భర్తీ మళ్లీ వెనక్కు వెళ్లే  అవకాశం ఉందని ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమైతే నామినేటేడ్ పోస్టులు ర్తీ చేసే అవకాశం ఉందని ఆశావాహులు భావిస్తున్నారు. వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగితే నామినేటేడ్ పోస్టులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నామినేటేడ్ పోస్టుల భర్తీకి  ఎన్నికలు అడ్డుగా నిలుస్తున్నాయని ఆశావాహులు అభిప్రాయంతో ఉన్నారు. 

click me!