‘‘హెటిరో ’’ ఐటీ సోదాల్లో కలకలం.. బోరబండలోని ఇంట్లో రూ.200 కోట్ల నగదు సీజ్

By Siva KodatiFirst Published Oct 8, 2021, 7:29 PM IST
Highlights

హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో  పాటు 22 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. తాజాగా హైదరాబాద్ బోరబండలోని ఓ ఫ్లాట్ నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. వాహనాల్లో స్వాధీనం చేసుకున్న నగదును కోఠిలోని బ్యాంక్‌కు తరలించారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హెటిరో డ్రగ్స్ వ్యవహారంలో భారీగా నగదు పట్టుకున్నారు ఐటీ అధికారులు. మూడు రోజులుగా  హెటిరో డ్రగ్స్‌లో సోదాలు చేస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో  పాటు 22 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

తాజాగా హైదరాబాద్ బోరబండలోని (borabanda) ఓ ఫ్లాట్ నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. వాహనాల్లో స్వాధీనం చేసుకున్న నగదును కోఠిలోని బ్యాంక్‌కు తరలించారు. నాలుగు వాహనాల్లో నగదును బ్యాంక్‌కు పంపారు. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు అధికారుల ఇళ్లలోనూ నగదు దొరికింది. నగదుపై సరైన ఆధారాలను చూపించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. రూ.200 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో ఇన్‌వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read:హెటిరో సంస్థలో మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

కాగా, హెటిరో ఫార్మా సంస్థ కార్యాలయాల్లో బుధవారం నుండి income tax అధికారులు సోదాలు చేస్తున్నారు. మూడో రోజైన  శుక్రవారం నాడు కూడ ఆదాయపన్ను శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో hetero drugs ప్రధాన కార్యాలయం వద్దకు ఐటీ అధికారులు చేరుకొన్నారు. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు.  

మరోవైపు హెటిరో సంస్థ డైరెక్టర్లు, సీఈఓ ఇంట్లో సోదాలు ముగిశాయి. అయితే  సంస్థకు చెందిన కార్యాలయాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. corona సమయంలో  హెటిరో డ్రగ్స్ సంస్థ తయారు చేసిన ఔషదానికి సంబంధించి చేసుకొన్న ఒప్పందాలపై ఆదాయ పన్ను శాఖాధికారులు కేంద్రీకరించారు.హెటిరో డ్రగ్స్ సంస్థ నుండి కీలక డాక్యుమెంట్లు ఆదాయ పన్ను శాఖాధికారులు  స్వాధీనం చేసుకొన్నారు. హైద్రాబాద్, విశాఖపట్టణం, గుంటూరు, విజయవాడల్లోని సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్లు సందీప్ రెడ్డి, నరసింహరెడ్డి,వంశీకృష్ణ, పార్ధసారథిరెడ్డిలతో పాటు మరికొందరి ఇళ్లపై కూడా ఐటీ అధికారులు సోదాలను పూర్తి చేశారని సమాచారం. 

click me!