రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు: న్యాయవాది రామారావు చరిత్ర ఇదీ...

By pratap reddyFirst Published Sep 29, 2018, 8:26 AM IST
Highlights

న్యాయవాది రామారావుపై సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్లో కేసులున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అతడిపై చిలకలగూడ పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన నేపథ్యంపై ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

ఆ వార్తాకథనం ప్రకారం - న్యాయవాది రామారావుపై సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్లో కేసులున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అతడిపై చిలకలగూడ పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. ఒడిశాలోని బరంపురానికి చెందిన ఇమ్మినేని రామారావు కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి ఎల్లారెడ్డిగూడ పడాల రామిరెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించాడు. ఆ తర్వాత బరంపురం వెళ్లిపోయాడు. 

నాలుగేళ్ల తర్వాత మళ్లీ  హైదరాబాదు నగరానికి వచ్చి పద్మారావునగర్‌లో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డాడు. న్యాయవాదిగా కార్యాలయం తెరిచాడు. ఆస్తి, భూమి, ప్లాట్స్‌ తదితరాలకు సంబంధించిన వివాదాల్లో క్లయింట్లు ఇతని వద్దకు వస్తారని, ఆస్తుల పత్రాలను ఇతనికి అందజేస్తారని ఆంధ్రజ్యోతి రాసింది. 
అవి విలువైన ఆస్తులు, భూములైతే వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి కబ్జా చేస్తాడని ఆ పత్రిక ఆరోపిస్తూ వార్తాకథనాన్ని రాసింది. 

ఆంధ్రజ్యోతి వార్తాకథనం సారాంశం ఇంకా ఇలా ఉంది....న్యాయవాది రామారావు అనుచరులతో కలిసి వచ్చి తన ఇంటిని కబ్జా చేశాడని 2013 అక్టోబరు 24న పద్మారావునగర్‌కు చెందిన జి.సాయిపవన్‌ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భూకబ్జాలకు సంబంధించి 2016 జనవరి 11న ఒక్కరోజే రామారావుపై ఐదు కేసులు నమోదయ్యాయి. 

ఆ కేసుల్లో ఆ ఏడాది మార్చి 14వ తేదీన రామారావును చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. 19న రౌడీషీట్‌ తెరిచారు. ప్రస్తుతం ఇతనిపై చిలకలగూడ, చందానగర్‌, బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో 32 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో 14 చిలకలగూడ స్టేషన్లోనే నమోదయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం సిసిఎస్ కు బదిలీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

click me!