హైద్రాబాద్ నగరంలో సోమవారం నాడు మధ్యాహ్నం నుండి వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది.
హైదరాబాద్: Hyderabad నగరంలో సోమవారం నాడు మధ్యాహ్నం నుండి heavy Rain కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో సహాయక బృందాలను జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేసింది GHMC . ఆదివారం నాడు రాత్రి కూడా నగరంలో వర్షం కురిసింది. ఇవాళ రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున సహాయక బృందాలను .జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
సోమవారం నాడు రామంతాపూర్ లో 3 సెం.మీ, అంబర్ పేటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నగరంలోని మలక్ పేట, దిల్ షుక్ నగర్, కర్మన్ ఘాట్, హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సరూర్ నగర్, ఉప్పల్, తార్నాక, పీర్జాదీగూడ, పెద్ద అంబర్ పేట, అబ్దుల్లాపూర్ మెట్, సంతోషన్ నగర్, తుర్క యంజాల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.
undefined
సోమవారం నాడు మధ్యాహ్నం నుండి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సాయంత్రం నుండి మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సాయంత్రం పూట స్కూళ్లు, కాలేజీలు,ఆఫీసుల నుండి వచ్చే వారు వర్షంతో ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో ట్రాపిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం నీరు నిలిచిపోయింది.
మరో వైపు వర్షం కారణంగా అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావొద్దని కూడా జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మూతలు లేని మ్యాన్ హాోల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్ణాటక, గుజరాత్, కొంకణ్, పుదుచ్చేరి, కేరళ, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది జూన్ 26న కూడా హైద్రాబాద్ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశంతోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాలను నైరుతి రుతుపవనాలు మోసుకొచ్చాయి. ఆ ఏడాది జూన్ 21న కూడా హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాలో వర్షం కురిసింది.
also read:monsoon: దేశంలో విస్తారంగా వర్షాలు.. రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు
గోల్కొండ,షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, తదితర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో జిహెచ్ఎంసి డిఆర్ఎస్ బృందాలను అప్రమత్తం చేసింది.జూన్ 14, 15 తేదీల్లో హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింి. జూన్ 17న కూడా భారీ వర్షం హైద్రాబాద్ నగరంలో కురిసింది. వర్షం నీరు రోడ్లపై ప్రవహించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.