హైద్రాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆగిఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. మృతదేహాలను పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Shamshabad ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం నాడు సాయంత్రం జరిగిన Road Accident లో ముగ్గురు మరణించారు.ఆగి ఉన్న కంటైనర్ ను Car ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించారు. కారులో ఉన్న మృతదేహాలన పోలీసులు వెలికి తీస్తున్నారు. హైద్రాబాద్ పెద్ద గోల్కోండ వద్ద కారు ప్రమాదానికి గురైంది. కారు ముందు భాగం కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. దీంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. కారులో ఉన్న మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు.
మద్యం మత్తులోనే కారు నడపడంం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.మృుతులను మహారాష్ట్రలోని ఔరంగబాద్ కు చెందిన ఆనంద్, సంపత్, రంగనాథ్ లు గా గుర్తించారు. తిరుపతి నుండి ఔరంగబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
undefined
హైద్రాబాద్ నగరంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు పలు రకాల కారణాలున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. దీనికి తోడు అతి వేగంగా వాహనాలు నడపడం కూడా ప్రమాదానాలకు కారణాలుగా పోలీసులు చెబుతున్నారు.
గత నెల 29న హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మహారాష్ట్ర నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండలం మల్లారం వద్ద ఈ ఏడాది జూన్ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. లారీ, కారు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. మృతులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు చెందిన పాపారావు, ఆయన భార్య పద్మ, కారు డ్రైవర్ ఆంజనేయులుగా గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఏడాది జూన్ 9వ తేదీన భువనరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో వీరి బంధువు చనిపోవడంతో భార్యతో పాటు వదిన జంగమ్మను తీసుకుని నర్సింహ బైక్ పై బయలుదేరాడు. నర్సింహ నడుపుతున్న బైక్ ను అతివేగంతో వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నర్సింహతో పాటు వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై రక్తపుమడుగులో పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జూన్ 5న జనగామ జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ టవేరా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.దీంతో టవేరాలోని ముగ్గురు చనిపోయారు. అంతేకాదు ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషయమై స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది మే 27న న సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం అలీరాజ్ పేట బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ఆటో, లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.