తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం..

Published : Apr 03, 2023, 09:38 AM IST
తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం..

సారాంశం

తెలంగాణలోని పలు జిల్లాలో నేటి నుంచి రాబోయే రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

నమ్మిన వారికి రూ .40 కోట్ల టోకరా వేసిన పోలీస్ బ్రదర్స్.. ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసం...

ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఆదివారం జోగులాంబ గద్వాల్‌లో 43.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్) ప్రకారం.. రాష్ట్రంలోని మరో పది ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదైంది. 

పశ్చిమ బెంగాల్ లో మళ్లీ ఉద్రిక్తత.. శ్రీరామనవమి ర్యాలీలో రెండు వర్గాల ఘర్షణ.. బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు..

అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా అల్పపీడనాలు ఏర్పడి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. ‘‘ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది’’ అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.

రాజస్థాన్ లో ఘోరం.. తొమ్మిదేళ్ల బాలిక హత్య, ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ కవర్లో కుక్కి...

దీని ప్రభావంతో కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, ఖమ్మం, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాలలో వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?