వార్నీ.. ఇవి కూడా రికవరీ చేస్తారా... రైలు ఎక్కుతుంటే పడిపోయిన చెప్పు.. తిరిగి అప్పగించిన ఆర్పీఎఫ్..

Published : Apr 03, 2023, 07:57 AM IST
వార్నీ..  ఇవి కూడా రికవరీ చేస్తారా... రైలు ఎక్కుతుంటే పడిపోయిన చెప్పు.. తిరిగి అప్పగించిన ఆర్పీఎఫ్..

సారాంశం

రైలు ఎక్కుతుంటే ఓ ప్రయాణికుడి చెప్పు జారిపోయింది. ఆ చెప్పును రికవరీ చేసిన ఆర్పీఎఎఫ్.. సురక్షితంగా అతడికి అందజేశారు.   

కాజీపేట : రైలు ఎక్కేప్పుడు చెప్పులు జారిపోవడం కామన్ గా రైలు ప్రయాణికులు ప్రతీ ఒక్కరికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ తర్వాత ప్రయాణం అంతా చిరాకుతో గడవడం.. గమ్యస్థానానికి చేరిన తర్వాత ముందుగా ఏ చెప్పుల షాపు  కనబడితే అందులోకి దూరి.. ఏదో ఒక చెప్పులు కొనుక్కుని ఆ తర్వాత ముందుకు సాగుతుంటారు. రైలు ప్రయాణికులకు ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురవ్వడమో.. తమతో ప్రయాణించేవారికి ఎదరవడం చూసి ఉండడమో జరుగుతుంది. ఆ పోయిన చెప్పు ఎంత ఖరీదైనదైనా సరే..  దాని మీద ఇక ఆశలు వదులుకోవాల్సిందే. కానీ, కాజీపేట రైల్వే పోలీసులు మాత్రం అలాంటి ఇబ్బంది అవసరం లేదంటున్నారు.

రైలు ఎక్కేప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి చెప్పును తిరిగి అందించి.. తమ పనితీరును చాటుకున్నారు. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. బంగారం పోతేనే రికవరీ చేయడం కష్టమైన ఈ రోజుల్లో.. చెప్పును రికవరీ చేశారని  తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.  పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. శనివారం జనగామ జిల్లా చిలుకూరు మండలం పల్లగుట్టకు చెందిన రాజేష్(25) అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లాలనుకున్నాడు.  

పేపర్ లీక్.. కేటీఆర్ కేబినెట్‌లో వుండకూడదు, అప్పుడే విచారణ ముందుకు : రేవంత్ రెడ్డి

దీనికోసం స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుండడంతో.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. రైలు అయితే ఎక్కగలిగాడు.. కానీ, అతడి కాలికున్న చెప్పు ఒకటి జారి పట్టాల మధ్యలో పడిపోయింది. అది అతడిని బాధించింది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చెప్పులు అలా జారిపోవడంతో.. రైల్వే అధికారులకు ‘నాకు చాలా ఇష్టమైన చెప్పులు అవి.. చెప్పులు కొత్తవి’ జారిపోయాయి.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత స్పందించారు. వెంటనే చెప్పును రికవరీ చేయాల్సిందిగా కాజీపేట ఆర్పిఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆ విద్యార్థి చెప్పును రికవరీ చేశాడు. ఆ తర్వాత ఆదివారం నాడు కాజీపేటకు తీసుకువచ్చి రాజేష్ కి అప్పగించారు. సో, ఈసారి రైలు ఎక్కుతుంటే చెప్పులు జారిపోతే కంగారు పడాల్సిన పనిలేదు.. రైల్వే అధికారులకు ఓ ట్వీట్ చేస్తే చాలు..  పోయేదేముంది.. వస్తే చెప్పు తిరిగి వస్తుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?