మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

By ramya neerukondaFirst Published Sep 15, 2018, 12:44 PM IST
Highlights

శుక్రవారం సాయంత్రం నుంచి అమృత ఆస్పత్రిలో చికిత్స పొందగా.. కొద్ది సేపటి క్రితమే స్పృహలోకి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకు దూరమయ్యాడనే వార్త తెలుసుకొని కన్నీరు మున్నీరు అయ్యింది

మిర్యాలగూడలో కలకలం సృష్టించిన పరువుహత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమ కన్నా తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో సొంత అల్లుడుని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. భర్త ప్రణయ్ హత్యను కళ్లారా చూసిన అమృత దానిని తట్టుకోలేకపోయింది.

శుక్రవారం సాయంత్రం నుంచి అమృత ఆస్పత్రిలో చికిత్స పొందగా.. కొద్ది సేపటి క్రితమే స్పృహలోకి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకు దూరమయ్యాడనే వార్త తెలుసుకొని కన్నీరు మున్నీరు అయ్యింది. తన భర్తను హత్య చేయించింది తన తండ్రేనని అమృత పేర్కొంది. 

ప్రణయ్ చనిపోతే తాను పుట్టింటికి వస్తానని భావించి తన తండ్రి ఇలా చేశారని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పటికీ తన పుట్టింటికి వెళ్లనని తేల్చి చెప్పింది. తన భర్తను దారుణంగా హత్య చేయించిన తన తండ్రిని వదలొద్దని, కఠిన శిక్ష విధించాలని ఆమె పేర్కొంది. ఒక్కసారి తనకు అక్షయ్ ని చూసే అవకాశం కల్పించాలని అమృత వేడుకుంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రణయ్ మృతదేహం వద్దకు కూడా ఆమెను తీసుకొని వెళ్లలేదు. ప్రణయ్ ని ఆఖరిసారి చూడనివ్వండి అంటూ విలపిస్తుంటే.. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు, బాబాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని సంబంధిత వార్తలు చదవండి

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

click me!