ప్రణయ్ హత్య: భార్య అమృత షాక్, 20 రోజుల క్రితమే రెక్కీ

Published : Sep 15, 2018, 12:38 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ప్రణయ్ హత్య: భార్య అమృత షాక్, 20 రోజుల క్రితమే రెక్కీ

సారాంశం

 పక్కా ప్రణాళిక ప్రకారమే మిర్యాలగుడాలో ప్రణయ్ ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడు 20 రోజుల క్రితం హతుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

మిర్యాలగూడ: పక్కా ప్రణాళిక ప్రకారమే మిర్యాలగుడాలో ప్రణయ్ ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడు 20 రోజుల క్రితం హతుడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22వ హంతకుడు ప్రణయ్ ఇంటి వద్ద తచ్చాడినట్లు పోలీసులు గుర్తించారు. 

అమృత వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తండ్రి మారుతీ రావు నుంచి ప్రణయ్ కి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని, దాంతో ప్రణయ్ దంపతులు పోలీసు రక్షణ కోరారని సమాచారం. భర్త హత్య వార్త విని అమృత షాక్ తింది.

ఇదిలావుంటే, ప్రణయ్ హత్య కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రణయ్, అమృత హైదరాబాదులో కాపురం పెట్టారు. అయితే, ఇక్కడ రక్షణ లేదనే ఉద్దేశంతో కొద్ది నెలల క్రితమే మిర్యాలగుడాకు మకాం మార్చారు. 

వినాయక చవితి పండుగకు ఇంటికి రావాలని తండ్రి మారుతీ రావు అమృతను కోరుతూ వచ్చాడని తెలుస్తోంది. అయితే, ఆమె అందుకు నిరాకరిస్తూ వచ్చింది. కాగా, మారుతీ రావు ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన గురించి మాట్లాడడానికి కూడా స్థానికులు ఇష్టపడడం లేదు. 

ఈ వార్తాకథనాలు చదవండి

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

 

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

PREV
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch