ప్రణయ్‌ హత్య: కిల్లర్ వాడిన ఆయుధం కోసం గాలింపు

By sivanagaprasad kodatiFirst Published Oct 1, 2018, 11:56 AM IST
Highlights

తక్కువ కులం వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మిర్యాలగూడకు చెందిన మారుతీరావు... తన అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుల చేత దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే.

తక్కువ కులం వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మిర్యాలగూడకు చెందిన మారుతీరావు... తన అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుల చేత దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆధారాల కోసం మారుతీరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. తాజాగా ప్రణయ్‌ను హత్య చేసేందుకు నిందితులు ఉపయోగించిన మరో ఆయుధం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సెప్టెంబర్ 14న ప్రణయ్‌ని హత్య చేసేందుకు అస్గర్‌అలీ, బీహార్‌కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మ‌తో కలిసి ద్విచక్ర వాహనంలో మిర్యాలగూడ చేరుకున్నారు. తల్లి, భార్యలతో కలిసి వెళుతున్న ప్రణయ్‌ని హత్య చేసిన హంతకుడు శర్మ... ఘటనాస్థలం వద్దే కత్తిని పడేసి వెళ్లాడు.

హత్యానంతరం అస్గర్‌అలీ.. శర్మను అదే వాహనంపై ఎక్కించుకుని సాగర్‌రోడ్ మీదుగా నల్లగొండ చేరుకున్నారు. తప్పించుకునే క్రమంలో మిర్యాలగూడ మండలం తుంగపాడు సమీపంలో బంధం వద్ద ఆగి వంతెన పిల్లర్ల కింద విశ్రాంతి తీసుకున్నారు.

అనంతరం శర్మ తుంగపాడు బంధంలో స్నానం చేసి.. టీషర్ట్, స్కూటీ సీటు కింద దాచిన మరో ఆయుధాన్ని నీటి ప్రవాహంలో వేశాడు.. విచారణ సమయంలో నిందితులు ఈ విషయం చెప్పడంతో పోలీసులు అలీ, శర్మలను వెంటబెట్టుకుని బంధం వద్ద గాలించారు. అయితే వరద ప్రవాహం ఉదృతంగా ఉండటంతో షర్ట్, కత్తి పోలీసులకు లభించలేదు.. 

ప్రణయ్ విగ్రహం.. వెల్లువెత్తిన నిరసనలు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు


 

click me!