జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

Published : Oct 01, 2018, 11:51 AM ISTUpdated : Oct 01, 2018, 11:59 AM IST
జగిత్యాల ప్రేమ దేశం కథ:  ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

సారాంశం

జగిత్యాలలో ఓ అమ్మాయిని ప్రేమించి ఇద్దరు స్నేహితులు  అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనపై మూడో వ్యక్తి ప్రమేయం ఉందనే అనుమానాలు కూడ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.


జగిత్యాల: జగిత్యాలలో ఓ అమ్మాయిని ప్రేమించి ఇద్దరు స్నేహితులు  అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనపై మూడో వ్యక్తి ప్రమేయం ఉందనే అనుమానాలు కూడ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే తన కొడుకు మరణానికి రవితేజ కారణమని మహేందర్ తండ్రి ఆరోపిస్తున్నాడు. మిస్టరీగా మారిన ఈ కేసు విషయమై పోలీసులు  ఆధారాలను సేకరిస్తున్నారు.

జగిత్యాలకు చెందిన జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్, విద్యానగర్‌కు చెందిన కుందారపు రవితేజ పదో తరగతి చదువుతున్నారు. ఇదే స్కూల్‌లో చదువుతున్న  అమ్మాయిని వీరిద్దరూ ప్రేమిస్తున్నారు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి పరస్పరం పెట్రోల్ పోసుకొని  నిప్పంటించుకొన్నారని  చెబుతున్నారు.

అయితే   ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి . మహేందర్ సంఘటనాస్థలంలోనే మృతి చెందగా... రవితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే  ఈ తరుణంలో మహేందర్ తండ్రి ఈ విషయమై అనుమానాలను వ్యక్తం చేశాడు.

రవితేజ కారణంగానే తన కొడుకు మరణించాడని మహేందర్  అభిప్రాయపడ్డారు. రవితేజ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వద్ద ఉంటున్నాడు.  అయితే మహేందర్, రవితేజల మృతికి సంబంధించి మూడో వ్యక్తి ప్రమేయం ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే  ఘర్షణ జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో వాస్తవాలను తెలుసుకొనేందుకుగాను లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు  పోలీసులు ప్రకటించారు.  

అయితే ఇద్దరు మిత్రులు మహేందర్, రవితేజలను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే ఈ ఘటన సమయంలో కొంత సేపు ఉన్న మరో మిత్రుడు ఆ ఘటనకు కారణమా... లేక ఇంకా ఎవరైనా ఈ ఘటనలో భాగస్వామ్యులుగా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే  మూడో వ్యక్తి ఎవరనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

ప్రేమదేశం సినిమా తరహాలో ఒక అమ్మాయి కోసం... (వీడియో)

టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu