ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

Published : Oct 16, 2018, 09:53 AM ISTUpdated : Oct 16, 2018, 09:57 AM IST
ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

సారాంశం

ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్‌ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

 మిర్యాలగూడలో  సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌ మోపాలని పోలీస్‌శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌తో వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్‌ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్‌ భార్య అమృతకు సోషల్‌ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్‌ రవీంద్ర ఆరా తీశారు.

అమృతను బెదిరిస్తున్న వారి సోషల్‌మీడియా ఖాతా వివరాలు తెలుసుకోవటంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యా ప్తు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు తెలిసింది. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు. ఆమెకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

 

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu