హైద్రాబాద్‌ డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

By narsimha lodeFirst Published Jun 5, 2020, 10:15 AM IST
Highlights

డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితులు అమిత్, పరంజ్యోతి సింగ్ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను నిందితులు తెలిపినట్టుగా పోలీసులు తెలిపారు.
 


హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితులు అమిత్, పరంజ్యోతి సింగ్ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను నిందితులు తెలిపినట్టుగా పోలీసులు తెలిపారు.

also read:హైదరాబాదులో మళ్లీ డ్రగ్స్ కలకలం: 300 మందిలో సినీ ప్రముఖులు సైతం..

మాస్కుల వ్యాపారం పేరుతో బెంగుళూరు నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చి విక్రయిస్తున్న హైద్రాబాద్ కు చెందిన ఇద్దరు నిందితులు అమిత్, పరంజ్యోతి సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.నిందితులతో 22 మంది నిందితులకు  సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను పోలీసులు గుర్తించారు. 

లాక్ డౌన్ సమయంలో సుమారు 22 మందికి  డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఎవరెవరికీ డ్రగ్స్ సరఫరా చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. 

బెంగుళూరులో డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిపై కూడ హైద్రాబాద్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకు నిందితులు  కొత్త వ్యక్తులను ఎంపిక చేసుకొన్నట్టుగా సమాచారం.నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!